Tirupati IITలో ఎంఎస్(రిసెర్చ్), పీహెచ్‌డీ
తిరుపతి(Tirupati)లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Indian Institute of Technology)(ఐఐటీటీపీ) - ఎంఎస్ (రిసెర్చ్), పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్ సంబంధిత విభాగాలు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్, ఎక్స్‌టర్నల్ విధానాలు ఎంచుకొనే వీలుంది. అభ్యర్థులు గరిష్ఠంగా మూడు విభాగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశోధన అంశాల సమాచారం కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. రిటెన్ టెస్ట్/ ఇంటర్వ్యూ, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెగ్యులర్ ప్రోగ్రామ్‌లలో చేరిన అభ్యర్థులకు హాఫ్ టైం రిసెర్చ్ అసిస్టెంట్‌షిప్(హెచ్‌ఆర్‌టీఏ) సౌకర్యం కల్పిస్తారు.
ఎంఎస్ (రిసెర్చ్)
స్పెషలైజేషన్‌లు: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ లేదా ఎంసీఏ/ సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. ఐఐటీల నుంచి కనీసం 8 సీజీపీఏతో బీఈ/ బీటెక్ పూర్తిచేసినవారు కూడా అర్హులే. ఎక్స్‌టర్నల్ అభ్యర్థులకు గేట్ స్కోర్ అవసరం లేదు.
పీహెచ్‌డీ
స్పెషలైజేషన్‌లు: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
అర్హత: ఇంజనీరింగ్/ సైన్స్ విభాగాన్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్/సబ్జెక్ట్‌లతో ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్(రిసెర్చ్)/ ఎమ్మెస్సీ/ డ్యూయెల్ డిగ్రీ(ఇంజనీరింగ్/ టెక్నాలజీ)/ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్ + ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐటీల నుంచి కనీసం 8 సీజీపీఏతో బీఈ/ బీటెక్ లేదా జామ్ స్కోర్ ద్వారా ఎమ్మెస్సీ పూర్తిచేసినవారు కూడా అర్హులే. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి సంబంధిత స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అన్ని విభాగాలకూ(యూజీసీ / సీఎ్‌సఐఆర్) నెట్(జేఆర్‌ఎఫ్/ ఎల్‌ఎస్)/ ఎన్‌బీహెచ్‌ఎం/ ఇన్‌స్పయిర్/ జెస్ట్ అర్హత లేదా గేట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.400; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 17
రిటెన్ టెస్ట్/ ఇంటర్వ్యూ: నవంబరు 7 నుంచి 30 వరకు
ఫలితాలు విడుదల: డిసెంబరు 9న
ప్రోగ్రామ్‌లో జాయినింగ్ తేదీ: డిసెంబరు 26
తరగతులు ప్రారంభం: 2023 జనవరి 2 నుంచి
వెబ్‌సైట్: iittp.ac.in
No comments:
Post a Comment