Wednesday, October 5, 2022

Certificate Courses in Foreign Languages in EFL University, Hyderabad

 ఇఫ్లూలో పార్ట్‌ టైం కోర్సులు

EFL University  is center of excellence in field of English and Foreign Languages. One of the best university in India. See the part-time courses it offers:

హైదరాబాద్‌లోని ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) - వివిధ ఫారిన్‌ లాంగ్వేజ్‌లకు సంబంధించి పార్ట్‌ టైం కోర్సులు అందిస్తోంది. సర్టిఫికెట్‌, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. ఒక్కో కోర్సు వ్యవధి రెండు సెమిస్టర్లు. ప్రోగ్రామ్‌ను అనుసరించి లాంగ్వేజ్‌లకు నిర్దేశించిన సమయాల్లో సెషన్స్‌ ఉంటాయి. 


సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రొఫిషియెన్సీ కోర్సు: అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, జపనీస్‌, కొరియన్‌, పర్షియన్‌, పోర్చుగీస్‌, రష్యన్‌, స్పానిష్‌ లాంగ్వేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సును హైబ్రిడ్‌ మోడ్‌లో అందిస్తున్నారు. అభ్యర్థులు ఫేస్‌ టు ఫేస్‌ లేదా ఆన్‌లైన్‌ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒక్కో లాంగ్వేజ్‌లో ఫేస్‌ టు ఫేస్‌ మోడ్‌లో 50, ఆన్‌లైన్‌ మోడ్‌లో 30 సీట్లు ఉన్నాయి. 

అర్హత: కనీసం పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. 

డిప్లొమా: అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, జపనీస్‌, పోర్చుగీస్‌, రష్యన్‌, స్పానిష్‌, చైనీస్‌, కొరియన్‌, పర్షియన్‌ లాంగ్వేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో లాంగ్వేజ్‌లో 30 సీట్లు ఉన్నాయి.  ఈ ప్రోగ్రామ్‌ ఫేస్‌ టు ఫేస్‌ విధానంలో ఉంటుంది.  

అర్హత: పదోతరగతి పాసైన అభ్యర్థులకు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. ఇఫ్లూ నుంచి సర్టిఫికెట్‌ ప్రొఫిషియెన్సీ కోర్సు ఉత్తీర్ణులైనవారు, అలాగే రెండు సెమిస్టర్ల బీఏ ఆనర్స్‌ ఇంగ్లీష్‌(ఒక ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా) కోర్సు పూర్తిచేసినవారు నేరుగా అడ్మిషన్‌ పొందవచ్చు.   


డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌

అరబిక్‌ లాంగ్వేజ్‌ అందుబాటులో ఉంది.  ఇందులో 30 సీట్లు ఉన్నాయి. పదోతరగతి అభ్యర్థులు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. ఇఫ్లూ నుంచి అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ అరబిక్‌ ఉత్తీర్ణులైనవారు నేరుగా అడ్మిషన్‌ పొందవచ్చు. 


అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా: అరబిక్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌, పర్షియన్‌ లాంగ్వేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు కూడా ఫేస్‌ టు ఫేస్‌ మోడ్‌లోనే ఉంటుంది. ఒక్కో లాంగ్వేజ్‌లో 30 సీట్లు ఉన్నాయి.  

అర్హత: పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇఫ్లూ నుంచి డిప్లొమా (ఫారిన్‌ లాంగ్వేజ్‌) పూర్తి చేసినవారికి, అలాగే నాలుగు సెమిస్టర్ల బీఏ ఆనర్స్‌ ఇంగ్లీష్‌(ఒక ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా) ఉత్తీర్ణులకు నేరుగా అడ్మిషన్‌ ఇస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.100; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50; దివ్యాంగులకు ఫీజు లేదు. 

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.200; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100; దివ్యాంగులకు ఫీజు లేదు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10

వెబ్‌సైట్‌: www.efluniversity.ac.in

No comments:

Post a Comment