Wednesday, October 5, 2022

Integrated PG in University of Hyderabad

 University of Hyderabadలో ఇంటిగ్రేటెడ్‌ పీజీ

The University of Hyderabad is a prestigious public central research university located in Hyderabad, Telangana, India. Founded in 1974, this mostly residential campus has more than 5,000 students and 400 faculty, from several disciplines

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూఓహెచ్‌) - ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్లు. కామన్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) 2022లో కోర్‌ పేపర్స్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. వీరు క్వాలిఫయింగ్‌ పేపర్స్‌లో నిర్ణీత కటాఫ్‌ మేరకు మార్కులు సాధించిందీ లేనిదీ పరిశీలించి కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. 


స్పెషలైజేషన్‌లు - సీట్లు 

  • ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో మేథమెటికల్‌ సైన్సెస్‌ 20, ఫిజిక్స్‌ 20, కెమికల్‌ సైన్స్‌ 20, బయాలజీ 20, అప్లయిడ్‌ జియాలజీ 10, హెల్త్‌ సైకాలజీ 20 సీట్లు ఉన్నాయి. 
  • ఇంటిగ్రేటెడ్‌ ఎంఏలో తెలుగు 19, హిందీ 10, లాంగ్వేజ్‌ సైన్సెస్‌ 19, ఉర్దూ 10, ఎకనామిక్స్‌ 14, హిస్టరీ 13, పొలిటికల్‌ సైన్స్‌ 13, సోషియాలజీ 14, ఆంత్రోపాలజీ 13 సీట్లు ఉన్నాయి. 
  • ఇంటిగ్రేటెడ్‌ ఎం.ఆప్టోమెట్రీలో 28 సీట్లు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌ వ్యవధి ఆరేళ్లు. 

అర్హత: ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎం.ఆప్టోమెట్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి మేథమెటిక్స్‌/ బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏలో ప్రవేశానికి ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండోతరగతి పూర్తిచేసి ఉండాలి.  లాంగ్వేజ్‌ స్పెషలైజేషన్‌లకు మాత్రం సంబంధిత భాష ప్రధాన సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. అభ్యర్థులందరికీ ఇంటర్‌ స్థాయిలో ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.600; ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.550; ఓబీసీ - ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.400; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.275

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 5

కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల: అక్టోబరు 12న

ఎంపికైన అబ్యర్థుల జాబితా విడుదల: అక్టోబరు 18న

అడ్మిషన్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబరు 25

అడ్మిషన్‌ లెటర్స్‌ జారీ చేసే తేదీ: అక్టోబరు 27

తరగతులు ప్రారంభం: నవంబరు 1 నుంచి

వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/

No comments:

Post a Comment