వివిధ కారణాలతో ఉద్యోగాన్ని, కేరీర్‌ని మధ్యలోనే వదిలేసిన మహిళల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ తన డిజిటల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో పలు స్వల్పకాలిక సాంకేతిక కోర్సులను (బేసిక్ అండ్ అడ్వాన్స్డ్) ప్రారంభించింది. ‘కెరీర్ బ్యాక్ 2 ఉమెన్(సిబి 2 ఉమెన్)’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ నైపుణ్య శిక్షణ ప్రోగ్రామ్స్ మహిళ ఉద్యోగ ప్రగతికి దోహదం చేస్తాయి. పలు సాంకేతిక కోర్సులను నిర్వహించేందుకు ఐఐటి మద్రాస్ డిజిటల్ స్కిల్స్ అకాడమీ ఫోరెన్సిక్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్‌స అండ్ సెక్యూరిటీ టెక్నాలజీస్(ఫిస్ట్)తో ఒప్పందం కుదుర్చుకుంది.
|
సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్ బేసిక్స్/అడ్వాన్స్డ్ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ / మెషీన్ లెర్నింగ్ (AI/ML):
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో నిపుణులను తయారు చేసేందుకు ఉద్దేశించిన కోర్సులు ఇవి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న మహిళా ఐటీ నిపుణులు, ఇంజినీర్లు, సైంటిస్టులు మరింత మెరుగైన విజ్ఞానం పొందేందుకు, నైపుణ్యం సంపాదించేందుకు ఈ కోర్సు దోహదం చేస్తుంది. అర్హతలు/ కాల వ్యవధి: ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ/డిప్లొమా(10+2+3) పాసైన వారు అర్హులు. 10 వారాల కాలవ్యవధి గల ఈ కోర్సు ఏప్రిల్ 1 నుంచి జూన్ 28 వరకు సాగుతుంది. కోర్సు ఫీజు రూ.41,300. 20 వారాల అడ్వాన్స్డ్‌డ కోర్సు ఫీజు రూ.59,000. నవంబర్ 29 వరకు కొనసాగుతుంది. సర్టిఫైడ్ ప్రొఫెషనల్ బ్యాక్ టు టెక్నికల్ ట్రాక్ (BTCUBE): ఇప్పటికే ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తూ వ్యక్తి గత కారణాల వల్ల ఉద్యోగాన్ని వదిలేసిన మహిళా నిపుణులకు ఉద్దేశించిన కోర్సు ఇది. తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నవారికి ఎంచుకున్న స్పెషలైజేషన్‌లో శిక్షణనిస్తారు. గత పదేళ్లలో ఐటీ పరిశ్రమలో జరుగుతున్న సంఘటనలపై పూర్తి అవగాహన, శిక్షణ ఇస్తారు. కొత్త లాంగ్వేజెస్, టెక్నాలజీ, నెట్‌వర్కింగ్ అండ్ సెక్యూరిటీ వంటివి ఇందులో ఉంటాయి. ఫీజు/కాల వ్యవధి: నాలుగు వారాల వ్యవధి గల ఈ కోర్సు ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తారు. కోర్సు ఫీజు రూ.17,700. సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్ బేసిక్/అడ్వాన్స్డ్ కోర్స్ ఇన్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనాలసిస్: డేటాసైన్స్ నేర్చుకోవాలనే ఆసక్తి గలవారి కోసం ఈ కోర్సును డిజైన్ చేశారు. డేటా అనలిటిక్స్ సమస్యలు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఇందులో శిక్షణనిస్తారు. బిగ్ డేటా వినియోగం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. అర్హతలు/కాల వ్యవధి: ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ/డిప్లొమా(10+2+3) పాసైన అభ్యర్థులు అర్హులు. పది వారాల కాల వ్యవధి గల బేసిక్ కోర్సు ఏప్రిల్ 1 నుంచి జూలై 28 వరకు సాగుతుంది. కోర్సు ఫీజు రూ.41,300. అరుుతే, 20 వారాల ‘సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్ అడ్వాన్స్డ్ కోర్స్ ఇన్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనాలసిస్’ ఫీజు రూ.59,000. పూర్తి వివరాలకు https://skillsacademy.iitm.ac.in చూడండి. |
Sunday, March 29, 2020
ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసిన మహిళల కోసం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment