Tuesday, March 31, 2020

Online courses for Degree Students

Online courses offered by NPTEL sponsored by Ministry of Human Resource Development are of great use in the present scenario. Some of JKCians registered their names. They are advised to do their courses scrupulously. The following information is useful for those who would like to go for the courses next year,
NPTEL web and video courses across 23 disciplines are available on our portal nptel.ac.in. In 2014 process of getting certified from NPTEL courses was initiated, so that learners get a tangible end result in the form of a certificate from the IITs/IISc for their effort.
Certification courses are offered twice a year (Jan-Jun, Jul-Dec). Joining a course is free. Anyone can learn from these courses anywhere anytime. No pre-requisites, no age limit, no entrance criteria to enroll.
Learning can be done by watching videos and this is tested by the weekly assignments, that are to be submitted online within the prescribed deadline. Any queries/doubts you may have, you can post in the respective discussion forum, which will be answered by the faculty and his/her team.
There is an optional proctored certification exam that the learner can take for a nominal fee at the end of the course to earn certificates from the IITs. The learner has to be present in person for the exam and currently exams are conducted only in India in about 130+ cities in two shifts. Learner has to appear at the designated exam centre to participate in the exam, where his/her id is verified. 25% of the final marks comes from the Assignments and 75% from the final exam.
The main benefits of participating in an online course under NPTEL are:
1. Students: credit transfer and better resume
2. Faculty: Refresher courses, AICTE recognized FDP courses
3. Working professionals: For upskilling and reskilling
For any more clarification / queries, please browse the site at:

Sunday, March 29, 2020

5 రకాల ఐటీ ఉద్యోగాలకునైపుణ్యాలు అందిపుచ్చుకుంటే సాఫ్ట్‌వేర్ కొలువు

ఆ ఐదు టెక్ రకాల జాబ్స్‌కు ...స్కిల్స్ ఉంటే కొలువు ఖాయం!

ఐఐటీల నుంచి స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల వరకూ.. బీఎస్సీ నుంచి ఎంబీఏ దాకా.. ఎలాంటి కాలేజీలో చేరినా.. ఏ కోర్సు చదివిన విద్యార్థి అయినా.. ముందుగా దృష్టిపెట్టేది సాఫ్ట్‌వేర్ కొలువులపైనే! అందుకోసం కోర్సులో చేరినప్పటి నుంచే అదనపు ఐటీ కోర్సులు, వివిధ సాఫ్ట్‌వేర్ సర్టిఫికేషన్స్ పూర్తిచేస్తున్న వైనం. అయినా ఐటీ కంపెనీలకు నిపుణుల కొరత వెంటాడుతోంది!! సాఫ్ట్‌వేర్ కంపెనీలు కాగడా పెట్టి వెతికినా... 5 రకాల ఐటీ ఉద్యోగాలకు సరైన అభ్యర్థులు దొరకడం కనాకష్టంగా మారిందని ఓ తాజా సర్వే వెల్లడించింది. నిపుణులు దొరకడం గగనంగా మారిన ఆ ఐదు టెక్ జాబ్స్ ఏమిటి?! స్కిల్ గ్యాప్ సమస్య.. ఎలాంటి నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే సాఫ్ట్‌వేర్ కొలువు సొంతమవుతుందో తెలుసుకుందాం...
Career Guidanceసాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. యువతకు ఓ స్వప్నం. ఏదో ఒక ఐటీ సంస్థలో.. ఒక్కసారి కాలుమోపితే చాలు.. కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే భావన! అందుకోసం ఎన్నో ప్రయత్నాలు!! మరోవైపు ఐటీ కంపెనీల్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సరైన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరక్క పలు టెక్ జాబ్స్‌ను భర్తీ చేయలేకపోతున్నామని వాపోతున్నాయి సాఫ్ట్‌వేర్ సంస్థలు.

ఇవే ఆ ఐదు :ఇటీవల ఇండీడ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం-ఐటీ రంగంలో కీలకంగా నిలుస్తున్న ఐదు ఉద్యోగాలు..
  1. డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ మేనేజర్
  2. డేటాబేస్ స్పెషలిస్ట్
  3. సీనియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్
  4. సిస్టమ్ ప్రోగ్రామర్
  5. వెబ్ అడ్మినిస్ట్రేటర్
ఈ పోస్టుల్లో నియామకాలకు నిపుణులు దొరకడంలేదు. సరైన నైపుణ్యాలున్న అభ్యర్థులు లభించక దేశంలో డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ మేనేజర్ పోస్టులు 63 శాతం, డేటాబేస్ స్పెషలిస్ట్ 62 శాతం, సీనియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్ 61 శాతం, సిస్టమ్ ప్రోగ్రామర్ 59 శాతం, వెబ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలు 58 శాతం మేర భర్తీ చేయడం క్లిష్టంగా మారిందని సర్వే వెల్లడించింది.

31 శాతం పెరిగిన టెక్ జాబ్స్ :దేశంలో ఉద్యోగార్థులకు టెక్ జాబ్స్ హాట్ కేక్‌లు. చదువు పూర్తిచేసుకుంటున్న అత్యధికశాతం మంది అభ్యర్థుల లక్ష్యం సాఫ్ట్‌వేర్ కొలువులే! ఈ టెక్ జాబ్ రోల్స్ గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో 31 శాతం పెరిగాయి. వీటి కోసం అన్వేషించే అభ్యర్థుల సంఖ్య కూడా ఈ వ్యవధిలో ఎనిమిది శాతం పెరిగింది. మరోవైపు భారత్‌లోని 53 శాతం టెక్ కంపెనీలు సరైన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) నివేదిక సైతం పేర్కొంది. అంటే.. ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు ఉన్నారు.. ఉద్యోగాలు ఇవ్వాలనుకునే కంపెనీలు ఉన్నాయి. అయినా టెక్ జాబ్స్ భర్తీ కావడం క్లిష్టంగా మారింది.

మరి సమస్య ఎక్కడ..?టెక్నికల్ ఉద్యోగాల పరంగా స్కిల్‌గ్యాప్ ప్రధాన సమస్య. ఇటీవల ఈ సమస్య మరింత ఎక్కువైనట్లు చెబుతున్నారు. మన దేశంలో ఐటీ సంస్థలకు కేరాఫ్‌గా నిలిచే ప్రధాన నగరాల్లో(బెంగళూరు, పుణె, హైదరాబాద్)ని సంస్థలకు సరైన టాలెంట్ దొరకడం కష్టంగా మారిందని ప్రముఖ జాబ్ కన్సల్టెన్సీ ఇండీడ్ కూడా పేర్కొంది. ఈ సంస్థ నివేదిక ప్రకారం-దేశంలోని మొత్తం ఐటీ నియామకాలను చూస్తే.. బెంగళూరులో 25శాతం; పుణెలో 9శాతం; హైదరాబాద్‌లో 8 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. మొత్తం ఐటీ నియామకాల్లో ఈ మూడు నగరాల్లోనే 42 శాతం జరుగుతున్నాయి. ఇలాంటి చోట్ల కూడా స్కిల్‌గ్యాప్ సమస్య కారణంగా ఆయా టెక్నాలజీ ఉద్యోగాలకు సరిపడే నైపుణ్యాలున్న అభ్యర్థులు లభించడం కష్టంగా ఉంది. దాంతో స్కిల్‌గ్యాప్ సమస్యకు అప్‌స్కిల్లింగ్ ఒక్కటే పరిష్కారం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కాబట్టి ఐటీ ఉద్యోగ ఔత్సాహికులు తమ సాఫ్ట్‌వేర్ కొలువు స్వప్నం నిజం చేసుకోవడానికి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలోని 50 శాతంపైగా టెక్ ఉద్యోగాలకు జావా ప్రోగ్రామింగ్ స్కిల్ తప్పనిసరిగా మారింది.

అప్లికేషన్స్‌పై ప్రత్యేక దృష్టి..ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగ ఔత్సాహికులు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. అప్లికేషన్ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, కోడింగ్, టెస్టింగ్, ఆపరేషన్స్ వంటి అంశాల్లో శిక్షణ పొందాలి. ప్రస్తుతం ఐటీ సంస్థలు తమ క్లయింట్లకు అందిస్తున్న సర్వీసులను పరిగణనలోకి తీసుకుంటే.. క్లౌడ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌పైనా పట్టు సాధించాల్సిన అవసరముంది. ఆయా నైపుణ్యాలు సాధించడం వల్ల డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో మంచి హోదాలు సొంతం చేసుకోవచ్చు.

డేటా నిర్వహణ :ప్రస్తుత పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అవసరమవుతున్న మరో కీలక నైపుణ్యం.. డేటాబేస్ మేనేజ్‌మెంట్. విస్తృతంగా ఉండే డేటాను సరైన రీతిలో సమకూర్చడం, బ్యాక్ అప్ మేనేజ్‌మెంట్ వంటివి సంస్థలకు కీలకం. కాబట్టి ఎస్‌క్యూఎల్, కంప్యూటర్ డిజైన్, ప్రోగ్రామింగ్, హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్, డేటా స్టోరేజ్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఫలితంగా ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్ ఫండమెంటల్స్, డేటాబేస్ రికవరీ వంటి అంశాల్లోనూ నైపుణ్యం లభిస్తుంది. దాంతో డేటాబేస్ మేనేజర్ హోదాను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

ప్రోగ్రామింగ్ స్కిల్స్ :సాఫ్ట్‌వేర్ సంస్థల్లో అత్యంత ప్రధానమైనది.. ప్రోగ్రామింగ్. సాఫ్ట్‌వేర్ లాంగ్వేజెస్‌ను నేర్చుకోవడం.. సొంతంగా కోడింగ్, ప్రోగ్రామింగ్ రాసే నైపుణ్యాలు సాధించడం వల్ల ప్రోగ్రామర్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రోగ్రామింగ్ అనేది సీఎస్‌ఈ,ఐటీ విద్యార్థులకు అకడమిక్స్‌లో భాగంగా ఉంటుంది. విద్యార్థులకు రియల్ టైమ్ నైపుణ్యాలు పొందే అవకాశం కాలేజీల్లో లభించట్లేదు. ఇలాంటి అభ్యర్థులు ప్రత్యేక శిక్షణ తీసుకోవడం లాభిస్తుంది.

వెబ్‌సైట్ అడ్మినిస్ట్రేషన్ :ప్రస్తుతం ఐటీ సంస్థల్లో వెబ్‌సైట్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. వెబ్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, నెట్‌వర్క్ డిజైన్, వెబ్ అనలిటిక్స్, డేటాబేస్ ఆర్కిటెక్చర్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకుంటే వెబ్‌సైట్ అడ్మినిస్ట్రేటర్‌గా కొలువుదీరొచ్చు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ :ఇటీవల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్స్/ఆఫీసర్స్ సేవలు కూడా కీలకంగా మారుతున్నాయి. వీటికి సంబంధించి సరైన నైపుణ్యాలున్న అభ్యర్థులు లభించడం సంస్థలకు కష్టంగా మారింది. సంస్థల్లో అంతర్గతంగా కంప్యూటర్ అనుసంధాన కార్యకలాపాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించడం, ఆయా విభాగాల మధ్య అనుసంధాన ప్రక్రియ నిర్వహించడం వీరి విధులు. సంస్థలకు సంబంధించి సాంకేతిక వ్యూహాలు రూపొందించడం కూడా మరో కీలకమైన బాధ్యతగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించడం ద్వారా ఇలాంటి కొలువులు సొంతం చేసుకునే అవకాశముంది. ఈ ఉద్యోగాలకు టెక్నికల్ నైపుణ్యాలే కాకుండా.. కోఆర్డినేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలైజింగ్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్ కూడా ఎంతో అవసరం.

నైపుణ్య మార్గాలు...టెక్ నైపుణ్యాలు పొందేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న మార్గాలు అనేకం. పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు(ఐబీఎం, సిస్కో, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటివి) అందిస్తున్న షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులను పూర్తి చేయడం ఉపయుక్తం. అలాగే మూక్స్, ఎన్‌పీటీఈఎల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ కోర్సులు అభ్యసించే వీలుంది. వీటిని సద్వినియోగం చేసుకుంటే స్కిల్ గ్యాప్ అనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తద్వారా జాబ్ రెడీగా రూపొందేందుకు మార్గం సుగమం అవుతుంది.

ఐటీ కెరీర్.. ముఖ్యాంశాలు
  • 2014 ఫిబ్రవరి నుంచి 2019 ఫిబ్రవరి మధ్య కాలంలో 8శాతం పెరిగిన టెక్నాలజీ జాబ్ రోల్స్
  • గత ఏడాదిలోనే 31 శాతం పెరుగుదల
  • మన దేశంలోని సంస్థల్లో 50 శాతంపైగా సంస్థలు జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్‌కు ప్రాధాన్యం

జాబ్ రెడీ స్కిల్స్ :ఐటీ రంగంలో ‘స్కిల్ గ్యాప్’ అనేది రోజూ వినిపించేదే! కాబట్టి విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. అకడమిక్స్‌లోని అంశాలకే పరిమితం కాకుండా.. సర్టిఫికేషన్ కోర్సులను పూర్తిచేయాలి. ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించుకుంటే.. కొలువు సొంతం చేసుకోవడం పెద్ద కష్టం కాదు.
- రమేశ్ లోగనాథన్, సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులు

మారుతున్న ప్రొఫైల్స్..ప్రస్తుత పరిస్థితుల్లో జాబ్ ప్రొఫైల్స్ నిరంతరం మారుతున్నాయి. దాంతో వాటికి సరితూగే టాలెంట్‌ను గుర్తించడం కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. కాబట్టి విద్యార్థులు నిరంతరం స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేయాలి. కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు అవసరమైన స్కిల్స్ అందించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
- శశికుమార్, ఎండీ, ఇండీడ్ ఇండియా

ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసిన మహిళల కోసం

వివిధ కారణాలతో ఉద్యోగాన్ని, కేరీర్‌ని మధ్యలోనే వదిలేసిన మహిళల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ తన డిజిటల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో పలు స్వల్పకాలిక సాంకేతిక కోర్సులను (బేసిక్ అండ్ అడ్వాన్స్డ్) ప్రారంభించింది. ‘కెరీర్ బ్యాక్ 2 ఉమెన్(సిబి 2 ఉమెన్)’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ నైపుణ్య శిక్షణ ప్రోగ్రామ్స్ మహిళ ఉద్యోగ ప్రగతికి దోహదం చేస్తాయి. పలు సాంకేతిక కోర్సులను నిర్వహించేందుకు ఐఐటి మద్రాస్ డిజిటల్ స్కిల్స్ అకాడమీ ఫోరెన్సిక్ ఇంటెలిజెన్స్‌ సర్వైలెన్‌‌స అండ్ సెక్యూరిటీ టెక్నాలజీస్(ఫిస్ట్)తో ఒప్పందం కుదుర్చుకుంది.
 సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్ బేసిక్స్/అడ్వాన్స్డ్‌‌ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌ / మెషీన్ లెర్నింగ్ (AI/ML):
  ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో నిపుణులను తయారు చేసేందుకు ఉద్దేశించిన కోర్సులు ఇవి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న మహిళా ఐటీ నిపుణులు, ఇంజినీర్లు, సైంటిస్టులు మరింత మెరుగైన విజ్ఞానం పొందేందుకు, నైపుణ్యం సంపాదించేందుకు ఈ కోర్సు దోహదం చేస్తుంది.
 అర్హతలు/ కాల వ్యవధి: ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ/డిప్లొమా(10+2+3) పాసైన వారు అర్హులు. 10 వారాల కాలవ్యవధి గల ఈ కోర్సు ఏప్రిల్ 1 నుంచి జూన్ 28 వరకు సాగుతుంది. కోర్సు ఫీజు రూ.41,300. 20 వారాల అడ్వాన్స్డ్‌‌డ కోర్సు ఫీజు రూ.59,000. నవంబర్ 29 వరకు కొనసాగుతుంది.

 సర్టిఫైడ్ ప్రొఫెషనల్ బ్యాక్ టు టెక్నికల్ ట్రాక్ (BTCUBE): ఇప్పటికే ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తూ వ్యక్తి గత కారణాల వల్ల ఉద్యోగాన్ని వదిలేసిన మహిళా నిపుణులకు ఉద్దేశించిన కోర్సు ఇది. తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నవారికి ఎంచుకున్న స్పెషలైజేషన్‌లో శిక్షణనిస్తారు. గత పదేళ్లలో ఐటీ పరిశ్రమలో జరుగుతున్న సంఘటనలపై పూర్తి అవగాహన, శిక్షణ ఇస్తారు. కొత్త లాంగ్వేజెస్, టెక్నాలజీ, నెట్‌వర్కింగ్ అండ్ సెక్యూరిటీ వంటివి ఇందులో ఉంటాయి.
 ఫీజు/కాల వ్యవధి: నాలుగు వారాల వ్యవధి గల ఈ కోర్సు ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తారు. కోర్సు ఫీజు రూ.17,700.

 సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్ బేసిక్/అడ్వాన్స్డ్ కోర్స్ ఇన్ డేటా సైన్స్‌ అండ్ బిగ్ డేటా అనాలసిస్:
 డేటాసైన్స్‌ నేర్చుకోవాలనే ఆసక్తి గలవారి కోసం ఈ కోర్సును డిజైన్ చేశారు. డేటా అనలిటిక్స్ సమస్యలు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఇందులో శిక్షణనిస్తారు. బిగ్ డేటా వినియోగం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు.
 అర్హతలు/కాల వ్యవధి: ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ/డిప్లొమా(10+2+3) పాసైన అభ్యర్థులు అర్హులు. పది వారాల కాల వ్యవధి గల బేసిక్ కోర్సు ఏప్రిల్ 1 నుంచి జూలై 28 వరకు సాగుతుంది. కోర్సు ఫీజు రూ.41,300. అరుుతే, 20 వారాల ‘సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్ అడ్వాన్స్డ్ కోర్స్ ఇన్ డేటా సైన్స్‌ అండ్ బిగ్ డేటా అనాలసిస్’ ఫీజు రూ.59,000.
 పూర్తి వివరాలకు https://skillsacademy.iitm.ac.in చూడండి.

విద్యార్థులు-స్టార్టప్ - iVE-IN పథకం

పరిశోధనలు, ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. వీటికి ఇటీవల కాలంలో విపరీతంగా ప్రాధాన్యం పెరుగుతోంది.
Bavithaఇటీవల విద్యార్థులు మొదలు.. ప్రొఫెసర్లు, స్టార్టప్ ఔత్సాహికుల వరకు.. పరిశోధనలు, ఆవిష్కరణల వైపు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు తమ సరికొత్త ఆవిష్కరణలకు ఉత్పత్తుల రూపం ఇచ్చి.. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారాలని యువత తపన! కానీ...సరైన మార్గాలు తెలియని పరిస్థితి! ఇలాంటి వారికి.. చేయూతనందించేందుకు కొత్త పథకంతో ముందుకొచ్చాయి దేశంలోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు.. ఐఐటీలు, ఐఐఎంలు! ఇందుకోసం.. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా.. iVE-IN (ఇన్నోవేషన్, వెంచరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఇండియా నెట్‌వర్క్) పేరుతో.. తాజాగా ఒక కొత్త ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో.. ఐవెయిన్ పథకం ప్రత్యేకతలు, లక్ష్యాలు, విధి విధానాలపై విశ్లేషణ...

పరిశోధనలకు ఊతం..
ఐఐటీలు, ఐఐఎంల్లో పరిశోధనలు, వాటి ఆధారంగా నూతన ఆవిష్కరణల దిశగా ప్రయత్నాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఆయా రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్పంచుకునే అవకాశం సదరు ఇన్‌స్టిట్యూట్స్‌లోని విద్యార్థులు, ప్రొఫెసర్లకు మాత్రమే లభిస్తోంది. మరెంతోమందికి రీసెర్చ్, ఇన్నోవేషన్‌పై ఆసక్తి ఉన్నా.. సరైనమార్గం గురించి అవగాహన ఉండటం లేదు. దాంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలు భావించాయి. ఆ క్రమంలో ఐఐటీలు, ఐఐఎంల కన్సార్షియం తాజాగా ఇన్నోవేషన్, వెంచరింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఇండియా నెట్‌వర్క్(ఐవెయిన్) పేరుతో ప్రత్యేక పథకానికి రూపకల్పన చేశాయి. దీని ద్వారా ఐఐటీలు, ఐఐఎంలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇన్‌స్టిట్యూట్స్ కు చెందిన ఔత్సాహిక పరిశోధకులకు చేయూత లభిస్తుంది. తద్వారా దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకో సిస్టమ్‌కు ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

అయిదు ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వ్య‌వ‌స్థాప‌క సభ్యులు
ఐవెయిన్ ప్రోగ్రామ్‌కు రెండు ఐఐటీలు(చెన్నై, ముంబై), మూడు ఐఐఎం (బెంగళూరు, కోల్‌కత, కోజికోడ్)లకు చెందిన ఫ్యాకల్టీ సభ్యులు వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరే ఈ పథకానికి సంబంధించిన అన్ని రకాల విధి విధానాల రూపకల్పన, సమీక్ష, తుది నిర్ణయం వంటివన్నీ చూస్తారు.

పథకం ప్రధాన లక్ష్యం ఇదే..
ఐవెయిన్ పథకం ప్రధానంగా నాలుగు లక్ష్యాలను నిర్దేశించుకుంది. అవి..
  • పరిశోధన నైపుణ్యాలకు సంబంధించి ఇంటర్ డిసిప్లినరీ కార్యవర్గాన్ని రూపొందించడం, దాని ద్వారా విధాన నిర్ణేతలు, అకడమిక్ వర్గాలు, పరిశోధకులు, ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్, స్టూడెంట్స్‌కు అవసరమైన సహకారం అందించాలి.
  • దేశంలో ఇన్నోవేషన్, వెంచరింగ్(పెట్టుబడులు), ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెగ్మెంట్స్ పరిస్థితులను గుర్తించి.. కీలకమైన విభాగాలకు అవసరమైన అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలి.
  • పలు స్థాయిల్లో విధాన నిర్ణయాలను సమర్థంగా రూపొందించడంలో, అమలు చేయడంలో సహకరించాలి.
  • వార్షిక కాన్ఫరెన్స్‌లు, జర్నల్ రూపకల్పన, డేటా సమూహాన్ని రూపొందించే క్రమంలో అకడమిక్ సొసైటీ ఏర్పాటు చేయాలి.

ప్రతిపాదనల ఆధారంగా..
  • అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న రంగానికి సంబంధించిన వివరాలతో ప్రతిపాదనలను పంపించాలి. ఇలా పంపిన ప్రతిపాదనలను ఐవెయిన్ రిపోర్ట్‌లో పొందుపరుస్తారు.
  • పరిశోధకులు పంపే ప్రతిపాదనలు నిర్దిష్టంగా కొన్ని విభాగాలకు సంబంధించి ఉండాలని ఐఐటీలు, ఐఐఎంలు నిర్ణయించాయి.
  • ఐవెయిన్-2020 రిపోర్ట్‌లో నిర్దేశించిన థీమ్‌కు సంబంధించిన అంశాలపైనే ప్రతిపాదనలు పంపాలి. అవి ఇన్నోవేషన్‌లో ఇండస్ట్రీ ట్రెండ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో పెట్టుబడులకు సంబంధించి ఉండాలి.
  • పరిశోధకులు తాము గుర్తించిన ఆవిష్కరణలు/పరిష్కారాలు పూర్తిగా సంబంధిత డేటా ఆధారంగా రూపొందించాల్సి ఉంటుంది.
  • నివేదికల రూపకల్పనలో భారతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి..
  • పరిశోధకులు, అకడమిక్ వర్గాలే కాకుండా.. ఇన్నోవేషన్, వెంచర్ ఎకో సిస్టమ్‌కు సంబంధించి ఇతరులు కూడా తమ ప్రతిపాదనలు, పబ్లికేషన్స్ పంపించొచ్చు.

Jobs after MSc Maths

A master's degree in mathematics makes a specialised and skilled person in solving various mathematical problems. They have the ability of logical thinking and solving the problems in various alternative methods. As a career, you can do the Phd and go for lectureships. With your M Sc degree you can find a job in school and parallely join some coaching classes. Even banks and financial institutions also prefer maths qualified personnel. If you like you can go for a chartered accountant course. If you are interested you can join DRDO, as a scientist and do further research under them.