Friday, November 11, 2022

జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - ఎంబీఏ

 

Xavier Aptitude Test for MBA

జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(Xavier School of Management) - ‘జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(ఎక్స్‌ఏటీ)2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ ద్వారానే దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ బీ-స్కూళ్లు, పార్టిసిపేటింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌లలో ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జంషెడ్‌పూర్‌, ఢిల్లీ క్యాంప్‌సలు అందిస్తున్న పీజీడీఎం ప్రోగ్రామ్‌(PGDM Programme)లో కూడా అడ్మిషన్‌ పొందవచ్చు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరికి 2023 జూన్‌ 10 నాటికి పరీక్షలు పూర్తికావాలి. సీఏ/ సీఎస్‌/ ఐసీడబ్ల్యూఏఐ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తిచేసినవారు కూడా అర్హులే. వయోపరిమితి నిబంధనలు లేవు.

ఎక్స్‌ఏటీ వివరాలు: ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. ఇందులో మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. మొత్తం పరీక్ష సమయం మూడు గంటల పది నిమిషాలు. టెస్ట్‌లో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌లో వెర్బల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ నుంచి 26 ప్రశ్నలు, డెసిషన్‌ మేకింగ్‌ నుంచి 21 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌

డేటా ఇంట్రప్రిటేషన్‌ నుంచి 28 ప్రశ్నలు ఇస్తారు. ఈ పార్ట్‌కు 165 నిమిషాల పరీక్ష సమయం ఇస్తారు. సమయం పూర్తికాగానే మొదటి పార్ట్‌ లాక్‌ అవుతుంది. రెండో పార్ట్‌ ప్రారంభమౌతుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 25 ప్రశ్నలు, ఒక ఎస్సే ప్రశ్న ఇస్తారు. ఈ పార్ట్‌కు 25 నిమిషాల సమయం ఇస్తారు. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు అయిదు ఆప్షన్స్‌ ఇస్తారు. వీటిలో సరైనదాన్ని గుర్తించాలి. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే, పావు వంతు మార్కు కోత విధిస్తారు. సమాధానం గుర్తించని పక్షంలో ప్రతి ఎనిమిది ప్రశ్నలకు 0.1 మార్కు కోత విధిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కులు వర్తించవు. మొదటి పార్ట్‌లో సాధించిన స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఎక్స్‌ఏటీ 2023 పర్సంటైల్‌ను నిర్ణయించి మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు సంబంధించిన ఎస్సే టెస్ట్‌ను మాత్రమే పరిశీలిస్తారు. టెస్ట్‌ సిలబస్‌, ఎస్సే టాపిక్స్‌, గత ప్రశ్నపత్రాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.2,000(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ అందిస్తున్న పీజీడీఎంలో చేరాలంటే అదనంగా రూ.200 చెల్లించాలి)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

ఎక్స్‌ఏటీ 2023 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌: డిసెంబరు 20 నుంచి

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం

ఎక్స్‌ఏటీ 2023 తేదీ: 2023 జనవరి 8

ఫలితాలు విడుదల: 2023 జనవరి 31

ఎక్స్‌ఏటీ స్కోర్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: జనవరి 31 నుంచి మార్చి 31 వరకు

వెబ్‌సైట్‌: www.xatonline.inmbauniverse.com

No comments:

Post a Comment