కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్షలో ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. ఇంగ్లిష్‌లో ప్రాథమిక స్థాయి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, మిస్ స్పెల్ట్ వ ర్డ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఒన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్, ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్, పాసివ్ వాయిస్ ఆఫ్ వెర్బ్స్, కన్వర్షన్ ఇన్‌టు డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ నరేషన్, షఫ్‌లింగ్ ఆఫ్ సెంటె న్స్ పార్ట్స్, షఫ్‌లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ పాసేజ్, క్లోజ్ పాసేజ్, కాంప్రహెన్షన్ పాసేజ్, వొకాబ్యులరీ, పాసివ్ వాయిస్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచెస్, క్వశ్చన్ ట్యాగ్స్, క్రియలు, విశేషణాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిపై ప్రాథమిక అవగాహన కోసం ప్రామాణిక డిక్షనరీ, స్టడీ మెటీరియల్, గ్రామర్ బుక్‌లను చదవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళి తెలుసుకోవాలి. రోజూ ఏదైనా ఒక ఇంగ్లిష్ దిన పత్రిక చదవడం, ఇంగ్లిష్ వార్తలు వినడం, జాతీయ టీవీ ఛానళ్లలో చర్చా కార్యక్రమాలను చూడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ‘ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్: ఎస్. చాంద్ పబ్లికేషన్స్’ బుక్ రిఫర్ చేయడం ప్రయోజనకరం.
No comments:
Post a Comment