Thursday, April 13, 2023

ఇంటర్వ్యూలో మైండ్‌సెట్‌ ఎందుకు కీలకం?

 ఇంటర్వ్యూలో మైండ్‌సెట్‌ ఎందుకు కీలకం?


ఏ కంపెనీలో అయితే ఉద్యోగం పొందాలని భావిస్తున్నారో.. ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉద్యోగార్థులకు ఉంది. అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు, మాజీ ఉద్యోగుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. కంపెనీ గురించి ఎలా పరిశోధిస్తారు, యాజమాన్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఛాలెంజింగ్‌ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు అనేది ఉద్యోగార్థుల ఆలోచన తీరుపై ఆధారపడి ఉంటుంది.

ఒక వ్యక్తి మైండ్‌సెట్‌ వారికి అవకాశాలను సృష్టిస్తుంది. ఉదాహరణకు.. అమితేష్ అనే ఓ వ్యక్తికి అసాధారణ నైపుణ్యాలు ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్‌ కోసం కష్టపడి పని చేశారు. అయినా తనకు తగిన ఉద్యోగం దొరకడం లేదు. ఉద్యోగం కోసం నెలల తరబడి ప్రయత్నిస్తున్నారు. అందరికీ ఉద్యోగ వేట సాధారణమే అయినా.. ఇక్కడ సమస్య అతని మైండ్‌సెట్‌. ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు ఒక ఐడియాను ఎస్టాబ్లిష్‌ చేయడం, దానిపై పని చేయడంపై కూడా ఏకకాలంలో దృష్టి పెట్టాలి. అతను స్టార్టప్‌ను నిర్మించడంలో విఫలం కావచ్చు, కానీ అతని మైండ్‌సెట్‌ ఎదుటివారికి చాలా వివరాలు తెలియజేస్తుంది. చేసిన ప్రయత్నాలు అతని నాయకత్వ నైపుణ్యాలు , దృష్టిని ప్రదర్శిస్తాయి. అతనికి చాలా దూరం వెళ్లే అవకాశాలు కల్పిస్తాయి.


ఉద్యోగాల విషయానికి వస్తే మైండ్‌సెట్ గురించి ప్రధానంగా తెలుసుకోవాలి. స్టార్టప్‌లు, ఎస్టాబ్లిష్డ్‌ కంపెనీలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు ఇది ఎలా అవసరమవుతుందో తెలుసుకోండి.


నియామకాల విషయానికి వస్తే స్టార్టప్‌లది భిన్నమైన పరిస్థితి. అభ్యర్థి గణనీయమైన మార్పును ఎలా తీసుకురాగలడు, వారి కార్యకలాపాలు, టెక్, మార్కెటింగ్, సేల్స్ లేదా ఇంటర్వ్యూ చేస్తున్న మరేదైనా డిపార్ట్‌మెంట్‌లో 10 రెట్లు వ్యత్యాసాన్ని ఎలా తీసుకురావచ్చనే దాని ఆధారంగా వారు ఉద్యోగాలు కల్పిస్తారు. స్టార్టప్‌లు వివిధ దశల కోసం ఉద్యోగులను హైర్‌ చేసుకుంటాయి. అవి.. నాస్సెంట్ స్టార్టప్‌లు, గ్రోత్ స్టేజ్, హైపర్-గ్రోత్.

నాస్సెంట్ స్టార్టప్‌లు ఒక ఐడియా, ప్రధాన బృందంతో అప్పుడే ప్రారంభమైన చిన్న సంస్థలు. నిధులను సేకరించి ఉండవచ్చు. వ్యాపార నమూనా తయారు అవుతూ ఉంటుంది, ముందుగా జట్టులో చేరడానికి వ్యక్తుల కోసం చూస్తున్నప్పుడు మైండ్‌సెట్‌ కీలకమైనది. ఇలాంటి ఉద్యోగాల కోసం అభ్యర్థి మైండ్‌సెట్‌కి ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు డిగ్రీ లేదా అనుభవం ఆధారంగా కాకుండా ఆప్టిట్యూడ్ ఆధారంగా ఉద్యోగార్థులను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి ఉత్తేజకరమైన ఉద్యోగాలు, కొన్ని ప్రముఖ స్టార్టప్‌ల ప్రారంభ దశ ఉద్యోగులుగా ఉన్నవారు ఇప్పుడు వ్యవస్థాపకులు. ప్రపంచ-స్థాయి ఉత్పత్తులను సొంతం చేసుకోవడం, పంపిణీ చేయడం అనే ఆలోచన వేలకొద్దీ స్టార్టప్‌లను విజయవంతంగా, చివరికి పెద్ద సంస్థలుగా నిలిపింది. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మాఫియా కుర్రాళ్లే ఉడాన్, క్యూర్‌ఫిట్ మొదలైన కంపెనీలను స్థాపించారు.

విదేశాలలో Paypal కంపెనీ ప్రారంభ దశ ఉద్యోగులు లింక్డ్‌ఇన్, టెస్లా, పలంటిర్, యూట్యూబ్ వంటి అనేక యునికార్న్స్, ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీలను స్థాపించారు. ఈ ఉద్యోగాలలో తప్పనిసరిగా సవాళ్లను ఎదుర్కోవాలి. నేర్చుకుంటూ, మెరుగవుతూ ఉండాలి. ఎల్లప్పుడూ తమ వంతు కృషి చేయడానికి ముందుండాలి.


ఎంటర్‌ప్రైజెస్ నియామకానికి నిర్మాణాత్మక విధానాన్ని కలిగి ఉంటాయి. వారు కొత్త ఉత్పత్తి శ్రేణిని నిర్మించడం లేదా ఇప్పటికే ఉన్న వాటిని స్కేలింగ్ చేయడం కోసం ఉద్యోగులను నియమిస్తారు. ఆ కంపెనీలకు ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఎంటర్‌ప్రైజెస్ స్టార్టప్‌లతో పోటీపడినప్పుడు, విషయాలను మార్చగల, ఉన్నతమైన ఉత్పత్తులను నిర్మించగల, విక్రయించగల ఉద్యోగి కోసం చూస్తారు. Amazon, Walmart, Paypal, Cisco వంటి వందలాది సంస్థలు.. అత్యుత్తమమైన వారిని నియమించుకోవడంలో విపరీతమైన వృద్ధిని, దూకుడును ప్రదర్శించారు.

వారి ఇంటర్వ్యూ ప్రక్రియలు ‘చేశాను’ అనే అంశం కంటే ‘చేస్తాను’ అనే దాన్ని తీసుకురావడానికి అభివృద్ధి చెందాయి. పని చేసే వారికి తీసుకురావడానికి హైపర్‌గ్రోత్ కంపెనీలు కూడా చేరాయి. బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ ప్రమాణంగా మారాయి. అటువంటి ఉద్యోగాలకు అవసరమైన మనస్తత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు, వేగంగా నేర్చుకోవడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి.

 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షల తేదీలు విడుదల.. హాల్‌‌టికెట్ల డౌన్‌లోడ్ డేట్స్ ఇవే..

ప్రపంచం వేగంగా మారుతోంది. ఇప్పుడు ట్విలియో, గోజెక్, స్విగ్గి, పోస్ట్‌మాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. వారు కాగితంపై అనుభవం కంటే ప్రయోగాత్మక అనుభవం కోసం చూస్తారు. అలాంటి స్థానాలను పొందడంలో అభ్యర్థి మనస్తత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఓ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. కాబట్టి అభ్యర్థి తన అనుభవం, వ్యక్తిత్వం ఆధారంగా ఉద్యోగాన్ని చూస్తారు. ఇది అభ్యర్థి నిర్దిష్ట కీలక లక్షణాలను యాక్సెస్ చేయడం, వారు దరఖాస్తు చేస్తున్న కంపెనీ DNAని అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది.

అభ్యర్థి రెజ్యూమ్ కంటే వారి మనస్తత్వం చాలా ఎక్కువ అని నిపుణులు నమ్ముతారు. నియామక విధానాలను చూసినప్పుడు, అభ్యర్థి వ్యక్తిత్వం, మైండ్‌సెట్‌, వివిధ అసైన్‌మెంట్‌ల పట్ల ఉన్న విధానం వారి తదుపరి ఉపాధిని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవచ్చు.



No comments:

Post a Comment