ప్రముఖ ఐటీ కంపెనీ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కష్టకాలంలో ఫ్రెషర్స్‌కు కొలువుల భరోసా ఇస్తోంది. ఈ సంవత్సరం ఏకంగా 40,000 కొత్త ఉద్యోగావకాశాలు కల్పించనుంది. కరోనా కారణంగా జాబ్ మార్కెట్ ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో టీసీఎస్ భారీ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతుండటంతో ఆశావాహుల్లో ఆనందం వ్యక్తమౌతోంది. అభ్యర్థులకు ఉపయోగపడేలా టీసీఎస్ ఎంపిక ప్రక్రియ, అర్హతలు, ప్రిపరేషన్లపై ప్రత్యేక కథనం...
క్రేజీ టీసీఎస్..
సమాచార, సాంకేతిక సేవల కన్సల్టింగ్ సంస్థ టీసీఎస్‌కు 46 దేశాల్లోని 149 ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. దేశీయ ఐటీ రంగ కెరీర్ విషయానికొస్తే టీసీఎస్ ముందు వరుసలో నిలుస్తోంది. టీసీఎస్‌లో కొలువుతో జాబ్ సెక్యూరిటీ లభిస్తుందనే భావన ఇందుకు ప్రధాన కారణం. దాంతోపాటు చక్కటి పనివాతావరణం, కెరీర్ గ్రోత్ అవకాశాలు ప్రతిభావంతులను ఆకర్షిస్తున్నాయి. దీంతో కోర్సులు పూర్తి అవుతుండగానే అభ్యర్థులు టీసీఎస్‌లో ఉద్యోగ సాధనపై దృష్టిసారిస్తున్నారు.
రెండు మార్గాలు..
టీసీఎస్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ రెండు పద్ధతులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ, సిలబస్ పరంగా పెద్దగా ఎలాంటి వ్యత్యాసం ఉండదు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విధానంలో పోటీ తక్కువగానూ, ఆఫ్ క్యాంపస్ మార్గంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం కరోనా కారణంగా క్యాంపస్ డ్రైవ్స్‌కు అవకాశం తక్కువనే చెప్పాలి. ఆఫ్ క్యాంపస్ అవకాశాల కోసం అభ్యర్థులు టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు..
- పదోతరగతి నుంచి అన్ని పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
- దరఖాస్తు సమయానికి తుది విద్యార్హతకు సంబంధించి ఒక బ్యాక్‌లాగ్‌ను మాత్రమే అనుమతిస్తారు. ఎంపిక సమయానికి బ్యాగ్‌లాగ్‌ను పూర్తి చేసుండాలి.
- ఆయా కోర్సులను రెగ్యులర్ విధానంలో చదువుతుండాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించి రెండేళ్లకు మించి గ్యాప్ ఉండకూడదు. గ్యాప్‌కు సంబంధించి సహేతుక కారణాలు ఉండాలి.
- కనీస వయసు 18 సంవత్సరాలు.
- బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ అన్ని స్ట్రీములు విద్యార్థులకు టీసీఎస్ అవకాశాలు కల్పిస్తోంది. ఆఫ్ క్యాంపస్ కొలువులకు సంబంధించి ఎంసీఏ, ఎంఎస్సీ విద్యార్థులు సైతం పోటీ పడవచ్చు.›
ఎంపిక ప్రక్రియ..
- టీసీఎస్ ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్టుతోపాటు ఇంటర్వూ ఉంటుంది.
- ఆన్‌లైన్ టెస్టులో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్ లాజిక్, కోడింగ్ తదితర అంశాలు ఉంటాయి.
ఇంగ్లిష్..
బేసిక్ గ్రామర్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 15 ప్రశ్నల్లో 10 ఎంసీక్యూలు, 5 ఫబ్(ఫిల్ అప్ ది బాక్సెస్) ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో నెగిటివ్ మార్కింగ్(0.33 మార్కులు) ఉంటుంది. టెన్సెస్, ఆర్టికల్స్, సెంటెన్స్ కరెక్షన్, పారా జంబుల్స్, నౌన్స్, మోడల్స్, స్పెల్లింగ్స్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, సబ్జెక్టు–వర్బ్ అగ్రిమెంట్, క్లోజ్ టెస్టులను ప్రాక్టీస్ చేయాలి. 10–12 ప్రశ్నలకు తగ్గకుండా సమాధానాలు ఇవ్వగలగాలి. పరీక్ష సమయం పది నిమిషాలు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్..
మొత్తం 15 ప్రశ్నల్లో 10 ఎంసీక్యూలు, 5 ఫబ్ ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 12–14 ప్రశ్నలు గుర్తించేలా సన్నద్ధమవడం తప్పనిసరి. అరేంజ్‌మెంట్స్ అండ్ సిరీస్, పీ అండ సీ, నంబర్ సిస్టమ్, ఎల్‌సీఎఫ్, హెచ్‌సీఎఫ్, పర్సంటేజెస్, రేషియోలు, ప్రపోర్షన్ అండ్ యావరేజెస్, రీజనింగ్, వర్క్ అండ్ టైమ్, జామెట్రి, డివిజబులిటీ, ప్రాఫిట్ అండ్ లాస్, ఏజెస్, సిరీస్ అండ్ ప్రోగ్రెషన్స్, ఈక్వేషన్స్ తదితర టాపిక్స్‌ను ప్రిపరేరవ్వాలి. పరీక్ష సమయం 30 నిమిషాలు.
కోడింగ్..
7 ఎంసీక్యూలు, 3 ఫబ్ ప్రశ్నలు అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా సీ ఇన్‌పుట్ అండ్ ఔట్‌పుట్ థియరీపై ప్రశ్నలు అడుగుతారు. అలాగే డేటా స్ట్రక్చర్ టాపిక్స్‌పై ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు.
ప్రోగ్రామింగ్ లాజిక్..
సీ, సీ++, జావా, పైథాన్, పెర్ల్ లాంగ్వేజ్‌లపై ఉంటుంది. పది ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 20 నిమిషాలు.
ఇంటర్వూ టిప్స్..
ఇంటర్వూలో టెక్నికల్, మేనేజీరియల్, హెచ్‌ఆర్ రౌండ్లు ఉంటాయి.
టెక్నికల్ రౌండ్..
- స్పెషలైజేష¯Œన్ కు సంబంధించి రెండు డొమై¯Œన్లు లేదా టెక్నాలజీలను ఎంచుకొని వాటిలో జరిగిన అభివృద్ధి, ఇతర అప్‌డేట్‌లను తెలుసుకోవాలి.
- ప్రాథమిక ప్రోగ్రామింగ్ భావనలపై పట్టు సాధించాలి. ఈ దిశగా ‘సి’లాంగ్వేజ్‌పై పరిజ్ఞానం అదనపు బలంగా ఉంటుంది.
- ప్రాజెక్టు వర్కులపై వివరణాత్మక ప్రశ్నలు అడుగుతారు. సాంకేతిక కార్యకలాపాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
మేనేజీరియల్ రౌండ్..
- ఇందులో ఒత్తిడిలో అభ్యర్థి ఏ రీతిలో స్పందిస్తున్నాడనే విషయాన్ని అంచనా వేస్తారు. దానికోసం ఇంటర్వూయర్లు అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగా గందరగోళ పరిచే, సంశయానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తారు. అలాగే భావోద్వేగాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. కఠిన పరిస్థితుల్లో అభ్యర్థి వ్యవహరించే తీరును పరీక్షిస్తారు.
హెచ్‌ఆర్ రౌండ్..
- ఈ రౌండ్‌లో సంస్థ నిబంధనలు, షరతుల గురించి పేర్కొనడంతోపాటు వాటికి అభ్యర్థి ప్రవర్తన, ఆలోచన విధానం సరితూగుతుందా లేదా అని అంచనా వేస్తారు.
- ఈ కంపెనీలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారనే ప్రశ్నతోపాటు ఇతర అభ్యర్థుల కంటే మీరేవిధంగా బెటర్ అనుకుంటున్నారనే తరహాలో ప్రశ్నలు అడుగుతారు.
- పరిచయం, చేసిన కోర్సులు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, సాఫ్ట్‌స్కిల్స్‌పై ప్రశ్నలు ఎదురవుతాయి.
No comments:
Post a Comment