Monday, April 27, 2020

ఇంటర్న్‌షిప్ ఇంటి నుంచే ‌! లాక్‌డౌన్‌ వేళ మారుతున్న తీరు


 ఇంటర్న్షిప్ ఇంటి నుంచే    ‌!  లాక్డౌన్ వేళ మారుతున్న తీరురిమోట్..వర్చువల్...ఆన్లైన్...
పేరు ఏదైనా ఇంటర్న్షిప్ రూపం, సారం ఒకటే!
పని స్థలానికి వెళ్లకుండా ఇంటి నుంచి/ వేరే ప్రదేశం నుంచి పనిచేయటం.
కంప్యూటర్.. దానికి అంతర్జాల అనుసంధానం ఉంటే చాలు!
వ్యక్తుల మధ్య భౌతిక దూరం తప్పనిసరైన లాక్డౌన్ కాలంలో...
సహజంగానే వీటికి ఆదరణ పెరుగుతోంది.
వీటి దరఖాస్తు ప్రక్రియ, ఇంటర్న్లుగా ఎంపికయ్యాక సమర్థంగా పూర్తిచేసే మెలకువలపై నిపుణుల సూచనలు.. ఇవిగో!
విద్యార్థులూ, ఉద్యోగార్థులూ పని అనుభవం, ఆచరణాత్మక నైపుణ్యాలూ పొందటానికి సంస్థలు అందించే స్వల్పకాలిక అవకాశం.. ఇంటర్న్షిప్. తరగతిగది బోధనకూ, పరిశ్రమ అవసరాలకూ నిర్మించే వంతెన ఇది. ముఖ్యంగా ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ విద్యార్థులకు ముఖ్యమైన ఇంటర్న్షిప్లది ఉద్యోగ సాధనలో ప్రధాన పాత్ర.
ప్రస్తుతం కొవిడ్-19 ఉపద్రవ ప్రభావం ఇంటర్న్షిప్ షెడ్యూళ్లను మార్చేస్తోంది. మే, జూన్ నెలల్లో జరిగే సమ్మర్ ఇంటర్న్షిప్లను చాలా సంస్థలు నిలిపివేశాయి. ఆఫర్లు పొందిన విద్యార్థులు వీలున్నంతవరకూ ఆన్లైన్/వర్చువల్ పద్ధతిలో ఇంటర్న్షిప్లను చేయటానికి కొన్ని సంస్థలు అనుమతిస్తున్నాయి.
జాతీయస్థాయి లాక్డౌన్ నేపథ్యంలో అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విద్యాసంస్థలకు నిర్దేశించిన ప్రకారం.. ప్రయాణం చేసి, ఇతరులతో కలిసి చేయాల్సిన ఇంటర్న్షిప్లను ప్రస్తుతం పక్కనపెట్టేశారు. ఇంటి నుంచి చేసేలా అనుమతించిన ఇంటర్న్షిప్లను మాత్రం కొనసాగించుకోవచ్ఛు ఐఐఎంలు, ఐఐటీలు వీటిని ప్రోత్సహిస్తూ ఆన్లైన్ ఇంటర్న్షిప్లను అమలు చేయాల్సిందిగా వివిధ సంస్థలను కోరుతున్నాయి. ఇప్పటికే ఫేస్బుక్ సంస్థ తన సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను పూర్తిగా వర్చువల్ పద్ధతిలోకి మార్చటానికి నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు దూరమైన విద్యార్థులూ, ప్రాక్టికల్ అనుభవం సంపాదించాల్సిన ఉద్యోగార్థులూ తమ విరామ సమయం ప్రయోజనకరంగా మల్చుకోవటానికి వర్చువల్ ఇంటర్న్షిప్లు చక్కని మార్గం. వీటితో ఉద్యోగ సంబంధిత కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం, ఇప్పటికే ఉన్నవాటికి సానపెట్టుకోవటం చేయవచ్ఛు సాఫ్ట్స్కిల్స్ను మెరుగుపర్చుకోవచ్ఛు అంతే కాదు; వర్చువల్గా పనిచేయటం వల్ల విద్యార్థులకు చేసే పనిని తమదిగా భావించే బాధ్యతాయుత దృష్టి ఏర్పడుతుంది. సమస్యా పరిష్కారం, ప్రణాళిక, చిక్కులు ఏర్పడితే సమన్వయ చేసుకోవటం లాంటి తార్కిక నైపుణ్యాలూ సొంతమవుతాయి.
ఆన్లైన్ ఇంటర్న్షిప్లు చిన్న, మధ్యతరహా, ఆన్లైన్ బిజినెస్లో ఉన్న సంస్థలూ; ఐటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థలూ; సేల్స్, మార్కెటింగ్, సోషల్ మీడియా సంస్థల్లో లభిస్తాయి.
ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం: వెబ్ డెవప్మెంట్, ప్రోగ్రామింగ్, మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, పైథాన్ డెవలప్మెంట్
బీఎస్సీ, బీఏ, బీకాం విద్యార్థుల కోసం: కంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, టీచింగ్, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్
మేనేజ్మెంట్ విద్యార్థుల కోసం: బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్స్, ఫైనాన్స్
ఆన్లైన్ ఇంటర్న్షిప్ గురించి కళాశాల ప్రొఫెసర్లూ, సీనియర్లను సంప్రదించి, వారి సహకారం తీసుకోవచ్ఛు పరిశ్రమకు సంబంధించి వారికున్న పరిచయాల ద్వారా వివిధ అవకాశాల గురించి తెలిసే అవకాశముంది.
దరఖాస్తు చేసేముందు ఇంటర్న్షిప్ విధులను అవగాహన చేసుకోవాలి. దానికి అనుగుణంగా సూటిగా, క్లుప్తంగా రెజ్యూమె రూపొందించాలి. అకడమిక్ అర్హతలూ, నైపుణ్యాలూ, చేసిన ప్రాజెక్టులూ, వాలంటీరింగ్ అనుభవాలను హైలైట్ చేయాలి. స్పెలింగ్, గ్రామర్ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. రెజ్యూమె ఒకటిన్నర పేజీకి మించకుండా తయారుచేసి, తగిన కవర్ లెటర్తో పాటు దాన్ని సబ్మిట్ చేయాలి.
ఇవి ఉంటే చాలు
ఆన్లైన్ ఇంటర్న్షిప్ విజయవంతంగా చేయటానికి లక్షణాలుండాలి
* చొరవ
* సాంకేతికతను మెరుగ్గా వినియోగించటంలో పరిజ్ఞానం
* ఒంటరిగా పనిచేయటంలో సౌలభ్యం
* కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారగల స్వభావం
దరఖాస్తు చేసేదెలా?
వివిధ రకాల ఆన్లైన్ ఇంటర్న్షిప్లు చేయటానికి విద్యార్థులు నేరుగా కంపెనీల సైట్లకు వెళ్లి దరఖాస్తు చేయనక్కర్లేదు. విద్యార్థులకూ, కంపెనీలకూ వారధిగా ఎన్నో ఇంటర్న్షిప్ వేదికలు ఉన్నాయి. కంపెనీలు తమ ఇంటర్న్షిప్ అవసరాలను వేదికలపై పోస్టు చేస్తాయి. విద్యార్థులు వేదికల్లో పేరు నమోదు చేసుకుని, తమకు ఆసక్తి ఉన్న వివిధ ఇంటర్న్షిప్లకు అక్కడే దరఖాస్తు చేసుకోవచ్ఛు దరఖాస్తు చేసేటపుడు కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సివుంటుంది. వాటిపై ఆధారపడి కంపెనీలు అభ్యర్థులను తర్వాతి రౌండ్ కోసం షార్ట్లిస్ట్ చేస్తాయి.
ఇంటర్న్షిప్వేదికల్లో ప్రముఖమైనవి కొన్ని...
https://internshala.com/
https://www.stumagz.com/in/discover
http://www.twenty19.com/
http://www.letsintern.com/
http://www.internworld.in/index.aspx
వర్చువల్ ఇంటర్న్షిప్ కాలవ్యవధి సాధారణంగా ఒక నెల నుంచి 6 నెలల వరకూ ఉంటుంది. వీటిని సమర్థంగా పూర్తిచేయాలంటే...
అనుకూలమైన స్థలం
ఇంట్లో నుంచి రోజూ పని చేయాల్సివున్నందున ఎలాంటి అంతరాయమూ ఉండని అనుకూలమైన స్థలాన్ని పని స్థలంగా కేటాయించుకోవాలి. మధ్యమధ్యలో ఎవరూ అంతరాయం కలిగించనిదిగా ఉండాలది. కుటుంబ సభ్యులకు మీ ఇంటర్న్షిప్ పని గంటలెప్పుడుంటాయో అర్థమయ్యేలా చెప్పాలి. స్నాక్స్, లంచ్, విరామాలకు నిర్దిష్ట సమయం కేటాయించుకుని పాటించాలి.
మొదటి వారం కీలకం
తొలి ముద్ర వేసుకోవటానికి చేరిన మొదటివారం ఇంటర్న్లకు ముఖ్యమైన సమయం. మెంటర్తో మాట్లాడి స్టైపెండ్, చేయాల్సిన పని గంటలు, రోజువారీ షెడ్యూల్ స్పష్టపరచుకోవాలి. డాక్యుమెంట్ షేరింగ్, గూగుల్ డ్రైవ్, డ్రాప్బాక్స్ లాంటి వర్క్ మేనేజ్మెంట్ టూల్స్ వాడగలగాలి. ప్రభావవంతమైన కమ్యూనికేషన్కు -మెయిల్ మెరుగ్గా రాయటం నేర్చుకోవాలి.
పనితీరెలా ఉందో అడగాలి
రిమోట్ ఇంటర్న్షిప్ కాబట్టి మార్గదర్శకత్వం, మెంటరింగ్ పరిమితంగానే ఉంటుంది. కానీ లోటు కనిపించకుండా కృషి చేయాలి. మెంటర్కు రోజూ అప్డేట్స్ను -మెయిల్స్ ద్వారా పంపుతూ, మీ పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకుంటూవుండాలి. మెంటర్కు ఉన్న పని ఒత్తిడిలో ఫీడ్బ్యాక్ సకాలంలో రాకపోయినా ఓపికతో వ్యవహరించాలి.
చొరవ చూపాలి
చెప్పిన పని వరకూ చేసి, మెంటర్ నిర్దేశాల కోసం నిరంతరం ఎదురుచూడకుండా చొరవ ప్రదర్శించగలిగితే మంచి అభిప్రాయం ఏర్పడేలా చేసుకోవచ్ఛు ఉదాహరణకు- కంపెనీ బ్లాగ్ కోసం కథనాలు రాసేపని మీదైతే.. పర్సనలైజ్డ్ కవర్ చిత్రాలను ఇలస్ట్రేటర్తో తయారుచేయవచ్ఛు కంపెనీ వెబ్సైట్లో లోపించిన ఫీచర్లు గమనించి, మెంటర్కు సమాచారం ఇవ్వొచ్చు.
సమయ పాలన
పర్యవేక్షించే వ్యక్తులెవరూ ఉండని వర్చువల్ వాతావరణంలో నిర్దిష్ట సమయానికి టార్గెట్లను పూర్తిచేయాలంటే స్వీయ క్రమశిక్షణతో ఉండాలి. ఆసక్తి పెంచుకుని, పని సకాలంలో పూర్తిచేస్తుండాలి. వ్యక్తిగత క్యాలెండర్లో ముఖ్యమైన తేదీలూ, అసైన్మెంట్లను నోట్ చేసుకోవటం, రోజువారీ టాస్క్ జాబితా నిర్వహణ చేస్తే మేలు. అత్యుత్తమ పని తీరును ప్రదర్శించటం ప్రధానం.
So first  make changes your resume, if necessary
Identify internship programme
Apply for Internship  and complete the programme



No comments:

Post a Comment