విదేశాలలో ఉన్నత విద్య ప్రవేశానికి ప్రయోగిద్దాం.. మూడు అస్త్రాలు!
![]() ![]()
స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్
![]()
ఏమేం ఉండాలి?
* విద్యార్థి నేపథ్యం, లక్ష్యాలు (వృత్తిగతమైనవి). * విద్య, వృత్తి వివరాలు (ఎంచుకున్న రంగంలో ఎంతవరకూ మెరుగో చెప్పవచ్ఛు) * వ్యక్తిగత వివరాలు (దరఖాస్తులో వాటికి అదనంగా వివరాలు, ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని పరిష్కరించినతీరు, ప్రేరణ కలిగించే అంశాలు మొదలైనవి.) * కోర్సు, విద్యాసంస్థను ఎంచుకోవడానికి కారణాలు. * విద్యాసంస్థ మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి? వంటివి ఉండాలి.
ఏం గమనిస్తారు?
* విద్యార్థి రాత నైపుణ్యాలను పరిశీలిస్తారు. కాబట్టి, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. భాష సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. మరీ ఎక్కువ పెద్ద పదాలను ఉపయోగించకూడదు. * ప్రత్యేకతలు, భిన్న వ్యక్తిత్వాన్ని గమనిస్తారు. అందుకని విద్యార్థి లక్ష్యాలు, వాటిని చేరుకోడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నారో తెలియజేయాలి. * టాలెంట్, గత అనుభవాలు, ఆసక్తుల ఆధారంగా యూనివర్సిటీకీ, డిపార్ట్‌మెంట్‌కూ ఎలా సాయపడగలుగుతారో చూస్తారు. దీని కోసం ఆటలు, సమాజసేవ, సొసైటీలు, క్లబ్బుల ద్వారా చేసిన కార్యక్రమాల వివరాలను పొందుపరచాలి. * ఎంచుకున్న విశ్వవిద్యాలయానికి సంబంధించి అందిస్తున్న ప్రోగ్రామ్‌లు, ఫ్యాకల్టీ, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, సౌకర్యాలపై అవగాహన పెంచుకొని, అవి తన (విద్యార్థి) భవిష్యత్తుకు ఎలా సాయపడతాయో ఎస్‌ఓపీలో వివరించాలి. విశ్వవిద్యాలయం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేశారనే భావన కలిగించాలి. * ఫలానా కోర్సును ఎంచుకోవడానికి ప్రేరణ కలిగించిన అంశాలను చెప్పవచ్ఛు సాగతీత వద్ధు ఇబ్బంది కలిగించే వాక్యాలు ఉండకూడదు.
వేల దరఖాస్తుల్లో ప్రత్యేకంగా నిలవాలంటే కొన్ని ప్రాథమిక లక్షణాలను పాటించాలి. సంబంధిత కోర్సు, పద పరిమితి, ఫార్మాట్ మొదలైన వాటిపై శ్రద్ధపెట్టాలి.
అడ్మిషన్ ఎస్సేలు
![]()
ఎలా ఉండాలి?: దరఖాస్తుకు వ్యాసం అదనపు విలువను చేకూర్చాలి. అందులో పరిచయం, వివరణ, ముగింపు తప్పనిసరి. విశ్వవిద్యాలయం షరతులను పాటించాలి. ఆన్‌లైన్‌లో సమర్పించే వీలు ఉన్నప్పటికీ విడిగా డాక్యుమెంట్‌లో ఎస్సే సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యాకరణ, అక్షర దోషాలు లేకుండా సరిచూసుకున్న తర్వాతే సమర్పించాలి. పదాల సంఖ్య పెరిగితే హెడ్డింగ్‌ను వదిలేయవచ్ఛు బోల్డ్, ఇటాలిక్ వంటివి అవసరం లేదు. పూర్తిగా ప్రొఫెషనల్‌గా ఉంటే సరిపోతుంది. హ్యాష్‌టాగ్‌లు, ఎమోజీలు, సంక్షిప్త పదాలను వాడకపోవడం మంచిది.
లెటర్ ఆఫ్ రెకమెండేషన్
![]()
ఎస్‌ఓపీలో విద్యార్థి తన గురించి తాను చెప్పుకుంటే, తన గురించి ఇతరుల అభిప్రాయం ఎల్‌ఓఆర్‌లో తెలుస్తుంది. మంచి విద్యానేపథ్యం ఉన్నవారు ఇస్తే దీనికి విలువ ఎక్కువ.
ఎల్‌ఓఆర్‌లో ఏ అంశాలు?
* నాయకత్వ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు. * సామర్థ్యాలు, నిర్ణీత కాలంలో సాధించిన విజయాలు. * విద్యార్థి/ ఎంప్లాయర్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలు.
ఎలా ఉండాలి?
* పేరాలుగా రాయాలి. విద్యాసంస్థ లేదా ప్రొఫెషనల్ సంస్థ లెటర్ హెడ్‌తో ఎల్‌ఓఆర్ సిద్ధం చేయాలి. * ఎస్‌ఓపీకి నకలులాగా ఉండకూడదు. * ఎల్‌ఓఆర్ ఇస్తున్న వారి సంక్షిప్త సమాచారం మొదటి పేరాలోనూ, వారి ఆధ్వర్యంలో విద్యార్థి పొందిన మార్కులు/ పనితీరును రెండో పేరాలో, ప్రాజెక్ట్ సంబంధిత అంశాలు, ఆ సమయంలో ప్రదర్శించిన నైపుణ్యాలు, రిస్క్ తీసుకోవడానికి ఎంతవరకూ ముందుంటాడు? పోటీతత్వం, టాలెంట్, నాయకత్వ లక్షణాలు వంటివి తర్వాతి పేరాల్లో ఉండాలి. తోటివారితో మెలిగే వైఖరి, ఎంచుకున్న కోర్సు అభ్యర్థి స్వభావానికి ఎలా సరిపోతుందో రాయాలి. అపజయాలు ఎదురైనప్పుడు వ్యవహరించే తీరునూ వివరించాలి. దరఖాస్తులో లేదా ఎస్‌ఓపీలో పొందుపరిచినవే కాకుండా విద్యార్థి వ్యక్తిత్వానికి సంబంధించి అదనపు విశేషాలు ఎల్‌ఓఆర్‌లో ఉండాలి. బాగా తెలిసినవాళ్ల నుంచి తీసుకోవడం మంచిది. విద్యార్థి స్వభావం, విజయాలను నామమాత్రంగా రాయకుండా సందర్భాలతో సహా చెప్పడం ప్రయోజనకరం. ఒకటికి మించి ఎల్‌ఓఆర్‌లు సమర్పిస్తున్నప్పుడు దేనికదే భిన్నంగా ఉండేలా చూసుకోవాలి. పరిశీలకులపై బలమైన ముద్ర వేసే విధంగా ఉండాలి. |
Saturday, December 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment