Thursday, November 28, 2019

మేనేజ్‌మెంట్ కోర్సులు

 వివిధ రకాల మేనేజ్‌మెంట్ కోర్సులు - పరీక్షలు 


...

మేనేజ్‌మెంట్ కోర్సుల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైంది ఎంబీఏ. కోర్సు వ్యవధి రెండేళ్లు. యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా దాని అనుబంధ కాలేజీలు నిర్వహించే కోర్సును ఎంబీఏ అంటారు. దీని తర్వాత ముఖ్యమైంది పీజీడీబీఏ. నేరుగా ఏఐసీటీఈ గుర్తింపుతో స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు, వాటి అనుబంధ కేంద్రాలు/కాలేజీలు నిర్వహించే కోర్సులను పీజీడీబీఏ అంటారు. ఈ రెండూ సమాన హోదా ఉన్న డిగ్రీలే. బీ స్కూల్స్ పీజీడీబీఏ డిగ్రీని ప్రదానం చేస్తాయి. ఇప్పుడు ఎంబీఏ/పీజీడీబీఏలో రకరకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఐటీలతోపాటు ఇంటర్నేషనల్ బిజినెస్, మీడియా మేనేజ్‌మెంట్, అడ్వర్టైజింగ్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్...ఇలా వందకు పైగా స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు రెండేళ్ల పాటు ఒకే అంశంలో స్పెషలైజేషన్‌తో ఎంబీఏ/పీజీడీబీఏ కోర్సులు రూపొందించాయి. ఎంబీఏ/పీజీడీబీఏ-హాస్పిటల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, రిటైల్ మేనేజ్‌మెంట్, ఏవియేషన్, ఇన్సూరెన్స్...ఇలా చాలా కోర్సులు అందిస్తున్నాయి.

కెరీర్ ఆప్షన్లు:మార్కెటింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, హెచ్‌ఆర్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగాలుంటారుు. అన్ని కంపెనీలూ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంబీఏ విద్యార్థులను నియమిస్తున్నాయి. బ్యాంక్‌ల్లో అవకాశాలు పెరిగాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మేనేజేరియల్ ఉద్యోగాలతోపాటు కొన్ని కోర్సులు పూర్తిచేస్తే టెక్నికల్ ఉద్యోగాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఎంబీఏ ఉద్యోగాల్లో ఎక్కువ మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో ఉంటాయి. ఆకట్టుకునే మాటతీరు, చొచ్చుకుపోయే స్వభావం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల్లో బాగా రాణించగలరు. ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఫార్మా, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్... ఇలా ప్రతి పరిశ్రమలోనూ ఎంబీఏ చదివినవాళ్లకు అవకాశాలు అపారం.

కాలేజీ ఎంపికలో...ఆ కాలేజీ ఎప్పుడు ఏర్పాటైంది? ఇప్పటిదాకా ఎన్ని బ్యాచ్‌లు బయటకొచ్చాయి? మొత్తం ఫ్యాకల్టీ సభ్యుల సంఖ్య? పీహెచ్‌డీ చేసిన ఫ్యాకల్టీ? ప్లేస్‌మెంట్ సెల్ ఉందా? గత రెండేళ్ల నియూమకాలు తీరు? ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి? మౌలిక సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ల్యాబ్స్, లైబ్రరీ, స్టూడెంట్ సిస్టమ్ రేషియో ఎంత? పూర్వ విద్యార్థులేమంటున్నారు? ఈ అంశాలను పరిశీలించి అవగాహనకు రావచ్చు.

స్పెషలైజేషన్ ఎంపికలో...ఈ విషయంలో విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను, వ్యక్తిత్వం, భవిష్యత్తు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్ డిమాండ్ ప్రకారమో లేదా ఇతరుల సలహా మేరకో స్పెషలైజేషన్లు ఎంచుకోవడం సరికాదు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ సలహాలు తీసుకోవాలి. వీలైతే ఇప్పటికే ఆయా విభాగాల్లో స్థిరపడిన ఉద్యోగుల అభిప్రాయం స్వీకరించాలి. మార్కెట్ ట్రెండ్ బట్టి స్పెషలైజేషన్ ఎంచుకోవడం సరికాదు.

వివిధ మేనేజ్‌మెంట్ పరీక్షలుజీమ్యాట్ - గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ఎవరికోసం: విదేశాల్లో ఎంబీఏ చదవాలనుకునే వారికి
అర్హత: 16 ఏళ్ల ఎడ్యుకేషన్ (10+2 తర్వాత నాలుగేళ్ల డిగ్రీ అంటే బీటెక్ లాంటి కోర్సులు). మూడేళ్ల డిగ్రీ విద్యార్థులు పీజీ ఫస్ట్ ఇయర్ పూర్తిచేసి ఈ పరీక్ష రాయొచ్చు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
పరీక్ష ఫీజు: 250 యూఎస్ డాలర్లు
పరీక్షలో: క్వాంటిటేటివ్, వెర్బల్, ఎనలిటికల్ రైటింగ్ అంశాలపై ప్రశ్నలుంటాయి.
ప్రవేశం: ప్రపంచ వ్యాప్తంగా 2000 బిజినెస్ స్కూళ్లలో

క్యాట్ - కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్నిర్వహణ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు
ప్రకటన: జూలై లేదా ఆగస్ట్‌లో
పరీక్ష: డిసెంబర్/జనవరిలో
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్నవాళ్లూ అర్హులే.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా
పరీక్షలో: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్సన్ అండ్ వెర్బల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రశ్నలతీరు, ప్రశ్నపత్ర స్వరూపం ఏటా మారుతుంది.
ప్రవేశం: ఐఐఎంలే కాకుండా దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లన్నీ క్యాట్ స్కోర్ ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఈ స్కోరే ప్రామాణికం.

ఎక్స్‌ఏటీ-జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్
నిర్వహణ:జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్-జంషెడ్‌పూర్
అర్హత: ఏదైనా డిగ్రీ
రిజిస్ట్రేషన్ టైం: సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు
పరీక్ష: జనవరిలో
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా
రాత పరీక్షలో: 200 ప్రశ్నలు 3 సెక్షన్లలో ఉంటాయి. వెర్బల్/రీడింగ్ కాంప్రహెన్షన్; క్వాంటిటేటివ్/డేటా ఇంటర్‌ప్రిటేషన్/రీజనింగ్; జనరల్ అవేర్‌నెస్ అంశాలపై ప్రశ్నలడుగుతారు. 250-300 పదాల్లో ఇంగ్లిష్‌లో వ్యాసం రాయాలి.
ప్రవేశం: ఈ పరీక్ష స్కోర్ ద్వారా 60 బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశం లభిస్తుంది.

మ్యాట్-మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్నిర్వహణ: ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ).
అర్హత: ఏదైనా డిగ్రీ
ప్రకటన: ఏటా నాలుగు సార్లు
పరీక్ష: ఏడాదికి నాలుగు సార్లు
(ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్‌ల్లో)
ప్రశ్నపత్రంలో: పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ స్కిల్స్, డేటా ఎనాలసిస్ అండ్ సఫిసియన్షీ, ఇంటెలిజన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూల ద్వారా.
ప్రవేశం: దేశవ్యాప్తంగా 500 బీ స్కూళ్లలో

ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-ఐసెట్నిర్వహణ: ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్
ప్రకటన: మార్చిలో
అర్హత: 45 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
రాత పరీక్షలో: 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 3 సెక్షన్‌లు. సెక్షన్-ఏ ఎనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు; సెక్షన్-బీ మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు; సెక్షన్-సీ కమ్యూనికేషన్ ఎబిలిటీ-50 ప్రశ్నలు.
ప్రవేశం: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఐసెట్ ర్యాంక్ ద్వారా అడ్మిషన్ లభిస్తుంది. మన రాష్ట్రంలో సుమారు 65,000 ఎంబీఏ సీట్లు ఉన్నాయి.

ఈమ్యాట్-ఎలక్ట్రానిక్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్అర్హత: ఏదైనా డిగ్రీ
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా
ప్రవేశం: దేశ వ్యాప్తంగా 48 బిజినెస్ స్కూళ్లలో

సింబయాసిస్ శ్నాప్ టెస్ట్నిర్వహణ: సింబయాసిస్ - పుణె
ప్రవేశం: సింబయాసిస్, అనుబంధ కళాశాలల్లో
ప్రకటన: నవంబర్‌లో
పరీక్ష: డిసెంబర్‌లో

ఆత్మా-ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏటీఎంఏ)అర్హత: ఎనీ డిగ్రీ
ప్రకటన: డిసెంబర్‌లో పరీక్ష: ఫిబ్రవరిలో
పరీక్షలో: ఎనలిటికల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్, వెర్బల్ స్కిల్స్ అంశాలపై ప్రశ్నలుంటాయి.
ప్రవేశం: దేశ వ్యాప్తంగా 139 ఇన్‌స్టిట్యూట్‌ల్లో

మరికొన్ని పరీక్షలు:కొన్ని బిజినెస్ స్కూళ్లు ప్రత్యేకంగా వేటికవే పరీక్షల నిర్వహిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి...ఐఎస్‌బీ, నార్సీమోంజీ, ఐఐఎఫ్‌టీ, ఐబీశాట్, బిట్‌శాట్, ఎఫ్‌ఎంఎస్, ఐఆర్‌ఎంఏ, టిస్, మైకా, ఐఎస్‌ఎం, ఐఆర్‌ఎంఏ, నిఫ్ట్, ఐఎంటీ, ఎఫ్‌ఆర్‌ఐ, బీవీయూ, ఓపెన్‌మ్యాట్, సీమ్యాట్...మొదలైనవి.

దేశంలో టాప్ బీ-స్కూళ్లు....
  • ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్-హైదరాబాద్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-అహ్మదాబాద్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-బెంగళూరు
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-కోల్‌కతా
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ఇండోర్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-కోజికోడ్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-లక్నో
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-షిల్లాంగ్
  • జమ్నలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ముంబై
  • జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్-జంషెడ్‌పూర్
  • ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ఢిల్లీ
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్‌ట్రేడ్-న్యూఢిల్లీ
  • ఇండియన్ ఇన్‌స్టిట్యట్ ఆఫ్ టెక్నాలజీ-ముంబై
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ
  • మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-గుర్‌గావ్
  • నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ముంబై
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్-ముంబై
  • ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్-ముంబై
  • సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ అండ్ హెచ్‌ఆర్‌డి-పుణె
  • సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్-పుణె
  • టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-ముంబై
  • ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-న్యూఢిల్లీ
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్-కోల్‌కతా
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ-ఘజియాబాద్
  • ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-న్యూఢిల్లీ
  • కేజే సోమయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ముంబై
  • లాల్ బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-న్యూఢిల్లీ
  • ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్-అహ్మదాబాద్
  • టీఏ పాయ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-మణిపాల్
  • జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-భువనేశ్వర్
  • భారతీ దాశన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-త్రిచీ
  • ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్-ఢిల్లీ
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్
  • ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్-చెన్నై
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్-ఆనంద్
  • నిర్మా యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-అహ్మదాబాద్
  • సిదన్హమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ -ముంబై
  • సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్-పుణె
  • బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ-నోయిడా
  • యూనివర్సిటీ ఆఫ్ పుణె-పుణె
  • గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-గోవా
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్-హైదరాబాద్
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిఎమ్-కోల్‌కతా
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూర్కీ
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్-పుణె
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ-నాగపూర్
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్-ముంబై
  • లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-చెన్నై
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-త్రిచీ
  • ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
  • సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికం మేనేజ్‌మెంట్-పుణె
  • యూనివర్సిటీ బిజినెస్ స్కూల్-చండీగఢ్
  • వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ముంబై

No comments:

Post a Comment