ఉపాధి గ్యారెంటీ - హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం
హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం.. కొంచెం ఆసక్తి ఉంటే చాలు జీవితంలో స్థిరపడొచ్చు. కోర్సు పూర్తై వెంటనే కొలువు దొరికే కెరీర్‌లివి. కొంచెం శ్రమిస్తే లగ్జరీ లైఫ్‌నూ సొంతం చేసుకోవచ్చు. పర్యాటకం, ఆతిథ్యం.. విస్తరిస్తున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. కేవలం పదోతరగతి అర్హతతోనే వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
హోటల్ మేనేజ్‌మెంట్..సేవా రంగంలో శరవేగంగా పురోగమిస్తున్న పరిశ్రమ. దశాబ్దం క్రితం వరకు మెట్రో సిటీలకే పరిమితమైన స్టార్ హోటళ్లు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. దాంతో నిపుణులైన మానవ వనరుల ఆవశ్యకత ఏర్పడుతోంది. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తవగానే ఉద్యోగంలో చేరాలనుకునేవారికి.. కష్టపడే ఉత్సాహవంతులకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు కొదవలేదు. ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు హోటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సులతోపాటు సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు కూడా అందిస్తున్నాయి.
జాతీయ స్థాయిలో...నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ దేశ వ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ)ను నిర్వహిస్తోంది. దీనికి ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. వయోపరిమితి 22 ఏళ్లు. ఎంపికైనవారికి మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అందిస్తుంది. జేఈఈతో 51 సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో 21 ఇన్‌స్టిట్యూట్‌లకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్ హోదా ఉంది. 12 ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థలు. మిగతా 18 ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు. వీటిలో సుమారు 7741 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌కు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు ఉంది.
జేఈఈ.. పరీక్ష ఇలా:పరీక్షలో మొత్తం ఐదు విభాగాల్లో, మూడు గంటల్లో అభ్యర్థి ప్రతిభను పరీక్షిస్తారు. విభాగాల వారీ...
కోర్సు స్వరూపమిదే:జేఈఈ ద్వారా ప్రవేశం లభించే బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సు మొత్తం ఆరు సెమిస్టర్లుగా ఉంటుంది. కోర్సు వ్యవధి మూడేళ్లు. దీన్ని ఎన్‌సీహెచ్‌ఎంసీటీ, ఇగ్నో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొత్తం కోర్సులో ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీసెస్; ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్ అండ్ హౌస్ కీపింగ్ వంటి హోటల్ పరిశ్రమ సంబంధిత అంశాలపై ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌కు అధిక ప్రాధాన్యమిస్తూ శిక్షణ సాగుతుంది.
వెబ్‌సైట్: http://nchmct.org
ఉపాధి అవకాశాలు:ప్రముఖ సంస్థల్లో బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసిన విద్యార్థులకు వంద శాతం ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. తాజ్ గ్రూప్, ఒబెరాయ్, ఐటీసీ, లీలా, హయాత్ హోటల్స్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి పోటీ పడుతుంటాయి. ఎయిర్ లైన్స్, రైల్వేలు, క్రూస్ లైన్స్, గెస్ట్‌హౌసెస్, టూరిజం సెంటర్స్‌లో కూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధిత హాస్టళ్ల(ఐఆర్‌సీటీసీ, రైల్వేలు)లో అవకాశాలు ఉంటాయి. దీనికితోడు రిటైల్ రంగం, ఎమ్మెన్సీలు, బీపీఓల్లో కూడా అవకాశాలు లభిస్తాయి. కెరీర్ పరంగా ప్రారంభంలో హోటల్, హాస్పిటాలిటీ పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా అడుగుపెట్టొచ్చు. ఈ క్రమంలో కిచెన్ మేనేజ్‌మెంట్, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్; గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ వంటి విభాగాల్లో ప్రవేశించొచ్చు. వీటితోపాటు షిప్పింగ్, క్రూయిజ్ లైన్స్, టూరిజం సంస్థల్లో కూడా అవకాశాలు అపారం. బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన వాళ్లు సాధారణ డిగ్రీతో లభించే యూపీఎస్సీ, ఏపీపీఎస్‌సీ, రైల్వేలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థలకూ దరఖాస్తు చే సుకోవచ్చు.
ఉన్నత విద్య:మనదేశంలో ఉన్నత విద్య నభ్యసించాలనుకునే వారు ఎమ్మెస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్‌మేనేజ్‌మెంట్ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, ఢిల్లీకి దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్‌ల్లో ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే విదేశాల్లో ఇంటర్న్‌షిప్‌తో సహా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా చేయొచ్చు.
స్పెషలైజేషన్లు కూడా:బీఎస్సీ కోర్సులో స్పెషలైజేషన్ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఫుడ్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజ్‌మెంట్, అకామడేషన్ మేనేజ్‌మెంట్...లాంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఈ సదుపాయం బెంగళూరు, చెన్నై, గోవా, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మొదటి, రెండు సెమిస్టర్లలో పొందిన మార్కుల ఆధారంగా స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. స్పెషలైజేషన్‌ను ఎంచుకున్నప్పటికీ మొదటి మూడు సెమిస్టర్లు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. నాలుగో సెమిస్టర్ నుంచి ఎంచుకున్న స్పెషలైజేషన్‌కు సంబంధించిన సబ్జెక్టులపై బోధన సాగుతుంది. ఇలా మూడేళ్లు పూర్తయ్యాక ఇగ్నో నుంచి బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ లభిస్తుంది.
మన రాష్ట్రంలో...మన రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ...బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు పలు ఇతర హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తోంది.
కోర్సు: బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్
కాల వ్యవధి: మూడేళ్లు. అర్హత: ఇంటర్
వయసు: 22ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 25
కోర్సు: క్రాఫ్ట్‌మన్‌షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్
కాల వ్యవధి: ఏడాదిన్నర-ఫుల్‌టైమ్
అర్హత: పదో తరగతి
వయసు: 22 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది)
కోర్సు: క్రాఫ్ట్‌మన్‌షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్
కాల వ్యవధి: 24 వారాలు(ఫుల్ టైమ్)
అర్హత: పదో తరగతి
వయసు: 22 సంవత్సరాలు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది)
కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ అకామెడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్
కాల వ్యవధి: ఏడాదిన్నర అర్హత: డిగ్రీ
వయసు: 25 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది)
వెబ్‌సైట్: www.ihm-hyd.org
హోటల్ మేనేజ్‌మెంట్.. ప్రధాన విభాగాలుహోటల్ మేనేజ్‌మెంట్ రంగాన్ని ప్రధానంగా నాలుగు విభాగాలుగా పేర్కోవచ్చు. అవి...
ఫుడ్ ప్రొడక్షన్: ఈ విభాగంలో ఆహారం తయారు చేస్తారు.
ఫుడ్ అండ్ బెవెరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ): ఈ విభాగంలో హోటల్‌లో అతిథుల అవసరాల్ని గుర్తించి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తారు.
ఫ్రంట్ ఆఫీస్: అతిథులను సాదరంగా ఆహ్వానించి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటంలో ఫ్రంట్ ఆఫీస్‌ది కీలక పాత్ర.
హౌస్ కీపింగ్: అతిథులు హోటల్ రూంలో దిగినప్పటి నుంచి ఖాళీ చేసి వెళ్లేవరకూ... హోటల్‌ను సొంత ఇల్లులా సకల సౌకర్యాలు కల్పించడం హౌస్‌కీపింగ్ బాధ్యత.
టూరిజంపచ్చని ప్రకృతిని చూసి పరవశించని మనసుండదు. జల జల జారే జలపాతాల జల్లుల్లో తడిసి ముద్దవని తనువుండదు. అందుకే.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. హిమాలయాల నుంచి భీమిలి కొండల వరకు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న భారతావనిలో పర్యాటక రంగం పరిఢవిల్లుతోంది. అనునిత్యం పర్యాటకులతో కళకళలాడుతోంది. దీంతో ‘అతిథి దేవో భవ’ అంటూ పర్యాటకులకు సేవలందించే వారి కోసం అన్వేషణ సాగుతోంది. ఈ రంగాన్ని వృత్తిగా మలచుకున్న వారికి అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. సెలవు రోజైతే చాలు, ఏ పర్యాటక ప్రాంతమైనా కిక్కిరిసిపోతోంది. ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులు దాదాపు 70 శాతం ఆక్యుపెన్సీ రేషియాని సాధిస్తున్నాయి. ఈ స్థాయిలో వస్తున్న కస్టమర్లను మళ్లీ మళ్లీ ఆకట్టుకోవాలంటే.. చక్కని సేవలందించడమే మార్గం. అందుకోసం సుశిక్షితులైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతోంది.
మీ సేవలో...గతంలో వేర్వేరుగా ఉన్న టూరిజం, హాస్పిటాలిటీ విభాగాలు ఇప్పుడు దాదాపు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. వచ్చిన పర్యాటకుల ‘సైట్ సీయింగ్’ బాధ్యతలను టూరిజం విభాగం నిర్వర్తిస్తే.. వారికి చక్కని మర్యాదలు చేస్తూ.. సేవలందించడం హాస్పిటాలిటీ విభాగం విధి. ఈ రెండిటిలో పట్టాలు చేతిలో పట్టుకున్న వారికి అనేక విభాగాల్లో అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రభుత్వ పర్యాటక శాఖ, ట్రావెల్ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్స్, టూర్ ఆపరేటర్లు, హోటల్స్‌లో ఉద్యోగం ఖాయం. వీటితోపాటు అనుబంధ విభాగాలైన ఎయిర్‌లైన్ కేటరింగ్, ల్యాండ్రీ, టూరిజం ప్రమోషన్ అండ్ సేల్స్‌లోనూ స్థానం సంపాదించవచ్చు. ఇలా అవకాశాలు అందిపుచ్చుకున్న వారు.. కార్గో, టికెటింగ్, వీసా, పాస్‌పోర్ట్ తదితర చట్టబద్ధ నిబంధనల పైనా చక్కని అవగాహన సాధించాలి. దీనివల్ల ఆయా ప్రాంతాలకు కొత్తగా వచ్చే అతిథులను అప్రమత్తం చేసి వారి పర్యటనను సుఖవంతం చేయడానికి వీలవుతుంది. తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయి విషయ పరిజ్ఞానం పొందడమూ ఎంతో ముఖ్యం.
ఏ కోర్సులు...ప్రస్తుతం మన దేశంలో పలు యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలో టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కోర్సులను అందిస్తున్నాయి. ఆరు నెలలు, సంవత్సర వ్యవధితో స్వల్ప కాలిక సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులకూ పలు విద్యా సంస్థలు తెరదీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ అనుమతి పొందిన రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకైతే భవిష్యత్తు తిరుగుండదు. ఈ కోర్సును ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, ఇతర ప్రముఖ వర్సిటీలు అందిస్తున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులకు నేరుగా మేనేజిరియల్ స్థాయి అవకాశాలు తలుపు తడతాయి. దీంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) కూడా ట్రావె ల్, టూరిజం, కార్గో ఇండస్ట్రీ అవసరాల కోసం సర్టిఫికెట్ కోర్సులకు రూపకల్పన చేసింది.
టూరిజం:టూరిజం విభాగంలో ప్రవేశించాలనుకునేవారికి రిజర్వేషన్, కౌంటర్ స్టాఫ్, టూర్ ప్లానర్స్, టూర్ గైడ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఎయిర్‌లైన్స్ విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్స్, కస్టమర్ సర్వీసెస్ విభాగాల్లో అవకాశాలు పొం దవచ్చు. టూర్ ఆపరేటింగ్ సంస్థల్లో మార్కెటింగ్ సిబ్బందిగా, గైడ్లుగా స్థానం సంపాదించవచ్చు. హోటళ్లలోనైతే అవకాశాల వెల్లువే.
హాస్పిటాలిటీ:హాస్పిటాలిటీలో కేటరింగ్, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, బుక్ కీపింగ్, రెస్టారెంట్, తదితర శాఖల్లో ఎన్నెన్నో అవకాశాలు. ఈ రంగంలో స్థిరపడటానికి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థలు హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ప్రత్యేక అంశంగా సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.
స్థిరపడాలంటే:ఈ రంగంలో స్థిరపడాలనుకుంటే సహనం ఎంతో అవసరం. చెరగని చిరునవ్వుతో, అలసట కనిపించనీయకుండా అతిథులకు సేవలందించేలా అభ్యర్థులు తమను తాము మలచుకోవాలి. దీంతోపాటు వారితో చక్కగా మెలిగేలా సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించుకోవాలి. అభ్యర్థులు స్వయంగా ప్రైవేట్‌గానైనా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ తీసుకోవాలి.
ఆదాయం.. అద్భుతం:చక్కని విషయ పరిజ్ఞానం ఉన్న వారికి ఆదాయం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు వేతనంతో పాటు ఏడాదికోమారు సిబ్బంది కుటుంబాలకు ఉచిత ప్రయాణ సదుపాయాలు, గమ్య స్థానాల్లో ఉచిత వసతి వంటి సదుపాయాలను కూడా అందజేస్తాయి. మధ్యస్థాయి ఉద్యోగాల్లో ప్రవేశించే వారికి ప్రారంభంలో కనీసం రూ. 15 వేల నెల జీతం గ్యారంటీ.
మన రాష్ట్రంలో ఎన్‌ఐటీహెచ్‌ఎం...టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్’ దేశవ్యాప్తంగా ప్రముఖంగా నిలిచింది. 2001లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన ఈ సంస్థ.. టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి ప్రతి ఏటా జూన్, జులై నెలల్లో ప్రకటన విడుదల చేస్తారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసే ఈ ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టేందుకు దేశవ్యాప్తంగా పోటీ నెలకొంటోంది. దేశంలోనే తొలిసారి టూరిజం అండ్ హాస్పిటాలిటీ స్పెషలైజేషన్‌తో ఎంబీఏను అందిస్తున్న సంస్థ ఇది. ఇక్కడ చదివినవాళ్లకు ఉపాధి గ్యారెంటీ అనడం అతిశయోక్తి కాదు.

- న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ 30
- రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30
- జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60
- ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ 50