Saturday, December 7, 2019


  విదేశాలలో   ఉన్నత విద్య ప్రవేశానికి ప్రయోగిద్దాం.. మూడు అస్త్రాలు!
ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన రాగానే యూనివర్సిటీలు, కోర్సులపై పరిశోధనలు చేస్తారు. టెస్ట్‌లు.. స్కోర్లపై ఆందోళన చెందుతుంటారు. ఫీజు, ఖర్చులు సమకూర్చుకోవడంలో సతమతమవుతుంటారు. కానీ అక్కడి విద్యాసంస్థలు మార్కులు, ఆర్థిక స్థోమతలే కాకుండా ఇంకొన్ని అంశాలనూ పరిశీలించి ప్రవేశం కల్పిస్తాయనే విషయాన్ని విస్మరిస్తారు. సీటు ఇచ్చేముందు వర్సిటీలు అభ్యర్థి ఆసక్తీ, వ్యక్తిత్వాలనూ అంచనా వేస్తున్నాయి. అందుకే వేలమందిలో ప్రత్యేకతను చాటుకొని ఎంపిక కావాలంటే తగిన అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. అవే అడ్మిషన్‌ ఎస్సే, ఎస్‌ఓపీ, ఎల్‌ఓఆర్‌లు.
విదేశీ విద్యలో మొదటి దశ ప్రీ-రిక్విజిట్‌ టెస్ట్‌లు, రెండోది అతి ముఖ్యమైన దరఖాస్తు ప్రక్రియ. దీనికి ముందు నుంచే సిద్ధం కావాలి. ఇందులో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ), లెటర్‌ ఆఫ్‌ రెకమెండేషన్‌ (ఎల్‌ఓఆర్‌), అకడమిక్‌ ఎస్సే ప్రధానమైనవి. కావాల్సినన్ని మార్కులు, పరిజ్ఞానం, ఆర్థిక స్థోమతలకు తగిన రుజువులు సమర్పించినప్పటికీ అడ్మిషన్‌ కమిటీ అదనంగా మరికొన్నింటిని అడగడానికి కారణమేమిటి? అంటే.. విద్యార్థిలో ఉండే ప్రత్యేక లక్షణాలను తెలుసుకోడానికే అని చెప్పవచ్ఛు వాటి ద్వారా అభ్యర్థికి ఉన్న నైపుణ్యాలు, భవిష్యత్తు లక్ష్యాలు తదితరాలపై ఎంతవరకు స్పష్టత ఉందో గమనిస్తారు. పరిశోధన ఆసక్తి, ఎంచుకున్న విద్యాసంస్థపై అవగాహన మొదలైన వివరాలను పరిశీలించడం ద్వారా విద్యార్థిపై ఒక అంచనాకు వస్తారు.
స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌
ఎస్‌ఓపీ విద్యార్థి వ్యక్తిత్వానికి ముఖచిత్రం లాంటిది. అడ్మిషన్‌ కమిటీని మెప్పించడానికి తోడ్పడే సాధనం. అకడమిక్‌ రికార్డు, ఇతర పరీక్షల స్కోర్లు అభ్యర్థి చదివేతీరును మాత్రమే తెలియజేస్తాయి. వాటితోపాటు వ్యక్తిత్వం, ఇతర నైపుణ్యాల గురించి తెలుసుకోడానికి ఎస్‌ఓపీ వీలు కల్పిస్తుంది. ఒకరకంగా మిగతావారితో పోలిస్తే తాను ఎందుకు భిన్నమో తెలియజేసే అవకాశాన్ని అభ్యర్థికి అందిస్తుంది. ఎంపిక నిర్ణయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఏమేం ఉండాలి?
* విద్యార్థి నేపథ్యం, లక్ష్యాలు (వృత్తిగతమైనవి).
* విద్య, వృత్తి వివరాలు (ఎంచుకున్న రంగంలో ఎంతవరకూ మెరుగో చెప్పవచ్ఛు)
* వ్యక్తిగత వివరాలు (దరఖాస్తులో వాటికి అదనంగా వివరాలు, ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని పరిష్కరించినతీరు, ప్రేరణ కలిగించే అంశాలు మొదలైనవి.)
* కోర్సు, విద్యాసంస్థను ఎంచుకోవడానికి కారణాలు.
* విద్యాసంస్థ మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి? వంటివి ఉండాలి.
ఏం గమనిస్తారు?
* విద్యార్థి రాత నైపుణ్యాలను పరిశీలిస్తారు. కాబట్టి, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. భాష సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. మరీ ఎక్కువ పెద్ద పదాలను ఉపయోగించకూడదు.
* ప్రత్యేకతలు, భిన్న వ్యక్తిత్వాన్ని గమనిస్తారు. అందుకని విద్యార్థి లక్ష్యాలు, వాటిని చేరుకోడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నారో తెలియజేయాలి.
* టాలెంట్‌, గత అనుభవాలు, ఆసక్తుల ఆధారంగా యూనివర్సిటీకీ, డిపార్ట్‌మెంట్‌కూ ఎలా సాయపడగలుగుతారో చూస్తారు. దీని కోసం ఆటలు, సమాజసేవ, సొసైటీలు, క్లబ్బుల ద్వారా చేసిన కార్యక్రమాల వివరాలను పొందుపరచాలి.
* ఎంచుకున్న విశ్వవిద్యాలయానికి సంబంధించి అందిస్తున్న ప్రోగ్రామ్‌లు, ఫ్యాకల్టీ, ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు, సౌకర్యాలపై అవగాహన పెంచుకొని, అవి తన (విద్యార్థి) భవిష్యత్తుకు ఎలా సాయపడతాయో ఎస్‌ఓపీలో వివరించాలి. విశ్వవిద్యాలయం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేశారనే భావన కలిగించాలి.
* ఫలానా కోర్సును ఎంచుకోవడానికి ప్రేరణ కలిగించిన అంశాలను చెప్పవచ్ఛు సాగతీత వద్ధు ఇబ్బంది కలిగించే వాక్యాలు ఉండకూడదు.
వేల దరఖాస్తుల్లో ప్రత్యేకంగా నిలవాలంటే కొన్ని ప్రాథమిక లక్షణాలను పాటించాలి. సంబంధిత కోర్సు, పద పరిమితి, ఫార్మాట్‌ మొదలైన వాటిపై శ్రద్ధపెట్టాలి.
అడ్మిషన్‌ ఎస్సేలు
ఎంబీఏ లేదా సంబంధిత కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేస్తే కొన్ని యూనివర్సిటీలు అడ్మిషన్‌ ఎస్సే అడుగుతాయి. మరికొన్ని సంస్థలు ప్రశ్నలకు సమాధానాలు రాయమంటాయి. వాటి ఆధారంగా విశ్వవిద్యాలయ అంచనాలకు, కోర్సుకు తగినట్లుగా విద్యార్థి ఉన్నాడో లేదో చూస్తాయి. ఉదాహరణకు- ఎంబీఏకు దరఖాస్తు చేసుకుంటే.. విద్యార్థికి నాయకత్వ లక్షణాలు ఉండాలనీ; ఎంఐఎస్‌ ప్రోగ్రామ్‌కు సృజనాత్మకత, త్వరగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం అవసరమనీ భావిస్తాయి. వీటికి నిర్దిష్ట ఫార్మాట్‌ అంటూ ఏమీ ఉండదు. విశ్వవిద్యాలయాలే ప్రోగ్రామ్‌కు సంబంధించి పంపాల్సిన ఎస్సేల వివరాలను అందజేస్తాయి. సాధారణంగా పరిమిత పదాల్లో లక్ష్యాలు, నాయకత్వం, కెరియర్‌ పురోగతి, అపజయాలు మొదలైన వాటిపై రాయమంటాయి.
ఎలా ఉండాలి?: దరఖాస్తుకు వ్యాసం అదనపు విలువను చేకూర్చాలి. అందులో పరిచయం, వివరణ, ముగింపు తప్పనిసరి. విశ్వవిద్యాలయం షరతులను పాటించాలి. ఆన్‌లైన్‌లో సమర్పించే వీలు ఉన్నప్పటికీ విడిగా డాక్యుమెంట్‌లో ఎస్సే సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యాకరణ, అక్షర దోషాలు లేకుండా సరిచూసుకున్న తర్వాతే సమర్పించాలి. పదాల సంఖ్య పెరిగితే హెడ్డింగ్‌ను వదిలేయవచ్ఛు బోల్డ్‌, ఇటాలిక్‌ వంటివి అవసరం లేదు. పూర్తిగా ప్రొఫెషనల్‌గా ఉంటే సరిపోతుంది. హ్యాష్‌టాగ్‌లు, ఎమోజీలు, సంక్షిప్త పదాలను వాడకపోవడం మంచిది.
లెటర్‌ ఆఫ్‌ రెకమెండేషన్‌
విద్యార్థి ప్రవేశానికి కచ్చితంగా అర్హుడని చెబుతూ ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఇది. కోర్సు, దేశంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థీ కనీసం 2-3 రెకమెండేషన్‌ ఆఫ్‌ లెటర్లను సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని విద్యార్థికి ప్రొఫెషనల్‌గా బాగా తెలిసినవారు ఇవ్వచ్ఛు లేదా కోర్సుకు సంబంధించిన సబ్జెక్టును బోధించే వారైనా రెకమెండ్‌ చేయవచ్ఛు డిగ్రీ విద్యార్థులైతే టీచర్లు, ప్రొఫెసర్లు, కాలేజీ కౌన్సెలర్లు, ప్రిన్సిపల్‌లను ఎల్‌ఓఆర్‌ అడగవచ్ఛు ఎంఎస్‌ అభ్యర్థులైతే ప్రొఫెసర్లు, ఇంటర్న్‌షిప్‌ సూపర్‌వైజర్లు/ టీం లీడ్‌/ మేనేజర్‌ నుంచి తీసుకోవచ్ఛు పని అనుభవం ఉన్నవారు తప్పనిసరిగా ప్రొఫెషనల్స్‌ నుంచి తీసుకొని సబ్‌మిట్‌ చేయాలి. ఎంబీఏ, పీహెచ్‌డీ అభ్యర్థులకు అనుభవం లేకపోతే కళాశాల ప్రొఫెసర్లు, ప్రాజెక్ట్‌ గైడ్‌ల నుంచి ఎల్‌ఓఆర్‌ పొందవచ్ఛు
ఎస్‌ఓపీలో విద్యార్థి తన గురించి తాను చెప్పుకుంటే, తన గురించి ఇతరుల అభిప్రాయం ఎల్‌ఓఆర్‌లో తెలుస్తుంది. మంచి విద్యానేపథ్యం ఉన్నవారు ఇస్తే దీనికి విలువ ఎక్కువ.
ఎల్‌ఓఆర్‌లో ఏ అంశాలు?
* నాయకత్వ, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు.
* సామర్థ్యాలు, నిర్ణీత కాలంలో సాధించిన విజయాలు.
* విద్యార్థి/ ఎంప్లాయర్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలు.
ఎలా ఉండాలి?
* పేరాలుగా రాయాలి. విద్యాసంస్థ లేదా ప్రొఫెషనల్‌ సంస్థ లెటర్‌ హెడ్‌తో ఎల్‌ఓఆర్‌ సిద్ధం చేయాలి.
* ఎస్‌ఓపీకి నకలులాగా ఉండకూడదు.
* ఎల్‌ఓఆర్‌ ఇస్తున్న వారి సంక్షిప్త సమాచారం మొదటి పేరాలోనూ, వారి ఆధ్వర్యంలో విద్యార్థి పొందిన మార్కులు/ పనితీరును రెండో పేరాలో, ప్రాజెక్ట్‌ సంబంధిత అంశాలు, ఆ సమయంలో ప్రదర్శించిన నైపుణ్యాలు, రిస్క్‌ తీసుకోవడానికి ఎంతవరకూ ముందుంటాడు? పోటీతత్వం, టాలెంట్‌, నాయకత్వ లక్షణాలు వంటివి తర్వాతి పేరాల్లో ఉండాలి. తోటివారితో మెలిగే వైఖరి, ఎంచుకున్న కోర్సు అభ్యర్థి స్వభావానికి ఎలా సరిపోతుందో రాయాలి. అపజయాలు ఎదురైనప్పుడు వ్యవహరించే తీరునూ వివరించాలి. దరఖాస్తులో లేదా ఎస్‌ఓపీలో పొందుపరిచినవే కాకుండా విద్యార్థి వ్యక్తిత్వానికి సంబంధించి అదనపు విశేషాలు ఎల్‌ఓఆర్‌లో ఉండాలి. బాగా తెలిసినవాళ్ల నుంచి తీసుకోవడం మంచిది. విద్యార్థి స్వభావం, విజయాలను నామమాత్రంగా రాయకుండా సందర్భాలతో సహా చెప్పడం ప్రయోజనకరం. ఒకటికి మించి ఎల్‌ఓఆర్‌లు సమర్పిస్తున్నప్పుడు దేనికదే భిన్నంగా ఉండేలా చూసుకోవాలి. పరిశీలకులపై బలమైన ముద్ర వేసే విధంగా ఉండాలి.

Thursday, November 28, 2019

హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం

ఉపాధి గ్యారెంటీ - హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం

హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం.. కొంచెం ఆసక్తి ఉంటే చాలు జీవితంలో స్థిరపడొచ్చు. కోర్సు పూర్తై వెంటనే కొలువు దొరికే కెరీర్‌లివి. కొంచెం శ్రమిస్తే లగ్జరీ లైఫ్‌నూ సొంతం చేసుకోవచ్చు. పర్యాటకం, ఆతిథ్యం.. విస్తరిస్తున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. కేవలం పదోతరగతి అర్హతతోనే వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

హోటల్ మేనేజ్‌మెంట్..
సేవా రంగంలో శరవేగంగా పురోగమిస్తున్న పరిశ్రమ. దశాబ్దం క్రితం వరకు మెట్రో సిటీలకే పరిమితమైన స్టార్ హోటళ్లు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. దాంతో నిపుణులైన మానవ వనరుల ఆవశ్యకత ఏర్పడుతోంది. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తవగానే ఉద్యోగంలో చేరాలనుకునేవారికి.. కష్టపడే ఉత్సాహవంతులకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు కొదవలేదు. ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు హోటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సులతోపాటు సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు కూడా అందిస్తున్నాయి.

జాతీయ స్థాయిలో...నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ దేశ వ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ)ను నిర్వహిస్తోంది. దీనికి ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. వయోపరిమితి 22 ఏళ్లు. ఎంపికైనవారికి మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అందిస్తుంది. జేఈఈతో 51 సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో 21 ఇన్‌స్టిట్యూట్‌లకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్ హోదా ఉంది. 12 ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థలు. మిగతా 18 ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు. వీటిలో సుమారు 7741 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌కు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు ఉంది.

జేఈఈ.. పరీక్ష ఇలా:పరీక్షలో మొత్తం ఐదు విభాగాల్లో, మూడు గంటల్లో అభ్యర్థి ప్రతిభను పరీక్షిస్తారు. విభాగాల వారీ...
  • న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ 30
  • రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30
  • జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30
  • ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60
  • ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ 50
ప్రశ్నలు అడుగుతారు.

కోర్సు స్వరూపమిదే:జేఈఈ ద్వారా ప్రవేశం లభించే బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సు మొత్తం ఆరు సెమిస్టర్లుగా ఉంటుంది. కోర్సు వ్యవధి మూడేళ్లు. దీన్ని ఎన్‌సీహెచ్‌ఎంసీటీ, ఇగ్నో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొత్తం కోర్సులో ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీసెస్; ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్ అండ్ హౌస్ కీపింగ్ వంటి హోటల్ పరిశ్రమ సంబంధిత అంశాలపై ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌కు అధిక ప్రాధాన్యమిస్తూ శిక్షణ సాగుతుంది.
వెబ్‌సైట్: http://nchmct.org

ఉపాధి అవకాశాలు:ప్రముఖ సంస్థల్లో బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసిన విద్యార్థులకు వంద శాతం ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. తాజ్ గ్రూప్, ఒబెరాయ్, ఐటీసీ, లీలా, హయాత్ హోటల్స్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి పోటీ పడుతుంటాయి. ఎయిర్ లైన్స్, రైల్వేలు, క్రూస్ లైన్స్, గెస్ట్‌హౌసెస్, టూరిజం సెంటర్స్‌లో కూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధిత హాస్టళ్ల(ఐఆర్‌సీటీసీ, రైల్వేలు)లో అవకాశాలు ఉంటాయి. దీనికితోడు రిటైల్ రంగం, ఎమ్మెన్సీలు, బీపీఓల్లో కూడా అవకాశాలు లభిస్తాయి. కెరీర్ పరంగా ప్రారంభంలో హోటల్, హాస్పిటాలిటీ పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా అడుగుపెట్టొచ్చు. ఈ క్రమంలో కిచెన్ మేనేజ్‌మెంట్, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్; గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ వంటి విభాగాల్లో ప్రవేశించొచ్చు. వీటితోపాటు షిప్పింగ్, క్రూయిజ్ లైన్స్, టూరిజం సంస్థల్లో కూడా అవకాశాలు అపారం. బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన వాళ్లు సాధారణ డిగ్రీతో లభించే యూపీఎస్సీ, ఏపీపీఎస్‌సీ, రైల్వేలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థలకూ దరఖాస్తు చే సుకోవచ్చు.

ఉన్నత విద్య:మనదేశంలో ఉన్నత విద్య నభ్యసించాలనుకునే వారు ఎమ్మెస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్‌మేనేజ్‌మెంట్ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, ఢిల్లీకి దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్‌ల్లో ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే విదేశాల్లో ఇంటర్న్‌షిప్‌తో సహా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా చేయొచ్చు.

స్పెషలైజేషన్లు కూడా:బీఎస్సీ కోర్సులో స్పెషలైజేషన్ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఫుడ్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజ్‌మెంట్, అకామడేషన్ మేనేజ్‌మెంట్...లాంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఈ సదుపాయం బెంగళూరు, చెన్నై, గోవా, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మొదటి, రెండు సెమిస్టర్లలో పొందిన మార్కుల ఆధారంగా స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. స్పెషలైజేషన్‌ను ఎంచుకున్నప్పటికీ మొదటి మూడు సెమిస్టర్లు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. నాలుగో సెమిస్టర్ నుంచి ఎంచుకున్న స్పెషలైజేషన్‌కు సంబంధించిన సబ్జెక్టులపై బోధన సాగుతుంది. ఇలా మూడేళ్లు పూర్తయ్యాక ఇగ్నో నుంచి బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ లభిస్తుంది.

మన రాష్ట్రంలో...మన రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ...బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు పలు ఇతర హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తోంది.
కోర్సు: బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్
కాల వ్యవధి: మూడేళ్లు. అర్హత: ఇంటర్
వయసు: 22ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 25

కోర్సు: క్రాఫ్ట్‌మన్‌షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్
కాల వ్యవధి: ఏడాదిన్నర-ఫుల్‌టైమ్
అర్హత: పదో తరగతి
వయసు: 22 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది)

కోర్సు: క్రాఫ్ట్‌మన్‌షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్
కాల వ్యవధి: 24 వారాలు(ఫుల్ టైమ్)
అర్హత: పదో తరగతి
వయసు: 22 సంవత్సరాలు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది)

కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ అకామెడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్
కాల వ్యవధి: ఏడాదిన్నర అర్హత: డిగ్రీ
వయసు: 25 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది)
వెబ్‌సైట్: www.ihm-hyd.org

హోటల్ మేనేజ్‌మెంట్.. ప్రధాన విభాగాలుహోటల్ మేనేజ్‌మెంట్ రంగాన్ని ప్రధానంగా నాలుగు విభాగాలుగా పేర్కోవచ్చు. అవి...
ఫుడ్ ప్రొడక్షన్: ఈ విభాగంలో ఆహారం తయారు చేస్తారు.
ఫుడ్ అండ్ బెవెరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ): ఈ విభాగంలో హోటల్‌లో అతిథుల అవసరాల్ని గుర్తించి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తారు.

ఫ్రంట్ ఆఫీస్: అతిథులను సాదరంగా ఆహ్వానించి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటంలో ఫ్రంట్ ఆఫీస్‌ది కీలక పాత్ర.

హౌస్ కీపింగ్: అతిథులు హోటల్ రూంలో దిగినప్పటి నుంచి ఖాళీ చేసి వెళ్లేవరకూ... హోటల్‌ను సొంత ఇల్లులా సకల సౌకర్యాలు కల్పించడం హౌస్‌కీపింగ్ బాధ్యత.

టూరిజంపచ్చని ప్రకృతిని చూసి పరవశించని మనసుండదు. జల జల జారే జలపాతాల జల్లుల్లో తడిసి ముద్దవని తనువుండదు. అందుకే.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. హిమాలయాల నుంచి భీమిలి కొండల వరకు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న భారతావనిలో పర్యాటక రంగం పరిఢవిల్లుతోంది. అనునిత్యం పర్యాటకులతో కళకళలాడుతోంది. దీంతో ‘అతిథి దేవో భవ’ అంటూ పర్యాటకులకు సేవలందించే వారి కోసం అన్వేషణ సాగుతోంది. ఈ రంగాన్ని వృత్తిగా మలచుకున్న వారికి అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. సెలవు రోజైతే చాలు, ఏ పర్యాటక ప్రాంతమైనా కిక్కిరిసిపోతోంది. ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులు దాదాపు 70 శాతం ఆక్యుపెన్సీ రేషియాని సాధిస్తున్నాయి. ఈ స్థాయిలో వస్తున్న కస్టమర్లను మళ్లీ మళ్లీ ఆకట్టుకోవాలంటే.. చక్కని సేవలందించడమే మార్గం. అందుకోసం సుశిక్షితులైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతోంది.

మీ సేవలో...గతంలో వేర్వేరుగా ఉన్న టూరిజం, హాస్పిటాలిటీ విభాగాలు ఇప్పుడు దాదాపు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. వచ్చిన పర్యాటకుల ‘సైట్ సీయింగ్’ బాధ్యతలను టూరిజం విభాగం నిర్వర్తిస్తే.. వారికి చక్కని మర్యాదలు చేస్తూ.. సేవలందించడం హాస్పిటాలిటీ విభాగం విధి. ఈ రెండిటిలో పట్టాలు చేతిలో పట్టుకున్న వారికి అనేక విభాగాల్లో అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రభుత్వ పర్యాటక శాఖ, ట్రావెల్ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్స్, టూర్ ఆపరేటర్లు, హోటల్స్‌లో ఉద్యోగం ఖాయం. వీటితోపాటు అనుబంధ విభాగాలైన ఎయిర్‌లైన్ కేటరింగ్, ల్యాండ్రీ, టూరిజం ప్రమోషన్ అండ్ సేల్స్‌లోనూ స్థానం సంపాదించవచ్చు. ఇలా అవకాశాలు అందిపుచ్చుకున్న వారు.. కార్గో, టికెటింగ్, వీసా, పాస్‌పోర్ట్ తదితర చట్టబద్ధ నిబంధనల పైనా చక్కని అవగాహన సాధించాలి. దీనివల్ల ఆయా ప్రాంతాలకు కొత్తగా వచ్చే అతిథులను అప్రమత్తం చేసి వారి పర్యటనను సుఖవంతం చేయడానికి వీలవుతుంది. తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయి విషయ పరిజ్ఞానం పొందడమూ ఎంతో ముఖ్యం.

ఏ కోర్సులు...ప్రస్తుతం మన దేశంలో పలు యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలో టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కోర్సులను అందిస్తున్నాయి. ఆరు నెలలు, సంవత్సర వ్యవధితో స్వల్ప కాలిక సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులకూ పలు విద్యా సంస్థలు తెరదీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ అనుమతి పొందిన రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకైతే భవిష్యత్తు తిరుగుండదు. ఈ కోర్సును ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, ఇతర ప్రముఖ వర్సిటీలు అందిస్తున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులకు నేరుగా మేనేజిరియల్ స్థాయి అవకాశాలు తలుపు తడతాయి. దీంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) కూడా ట్రావె ల్, టూరిజం, కార్గో ఇండస్ట్రీ అవసరాల కోసం సర్టిఫికెట్ కోర్సులకు రూపకల్పన చేసింది.

టూరిజం:టూరిజం విభాగంలో ప్రవేశించాలనుకునేవారికి రిజర్వేషన్, కౌంటర్ స్టాఫ్, టూర్ ప్లానర్స్, టూర్ గైడ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఎయిర్‌లైన్స్ విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్స్, కస్టమర్ సర్వీసెస్ విభాగాల్లో అవకాశాలు పొం దవచ్చు. టూర్ ఆపరేటింగ్ సంస్థల్లో మార్కెటింగ్ సిబ్బందిగా, గైడ్లుగా స్థానం సంపాదించవచ్చు. హోటళ్లలోనైతే అవకాశాల వెల్లువే.

హాస్పిటాలిటీ:హాస్పిటాలిటీలో కేటరింగ్, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, బుక్ కీపింగ్, రెస్టారెంట్, తదితర శాఖల్లో ఎన్నెన్నో అవకాశాలు. ఈ రంగంలో స్థిరపడటానికి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థలు హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ప్రత్యేక అంశంగా సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.

స్థిరపడాలంటే:ఈ రంగంలో స్థిరపడాలనుకుంటే సహనం ఎంతో అవసరం. చెరగని చిరునవ్వుతో, అలసట కనిపించనీయకుండా అతిథులకు సేవలందించేలా అభ్యర్థులు తమను తాము మలచుకోవాలి. దీంతోపాటు వారితో చక్కగా మెలిగేలా సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించుకోవాలి. అభ్యర్థులు స్వయంగా ప్రైవేట్‌గానైనా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ తీసుకోవాలి.

ఆదాయం.. అద్భుతం:చక్కని విషయ పరిజ్ఞానం ఉన్న వారికి ఆదాయం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు వేతనంతో పాటు ఏడాదికోమారు సిబ్బంది కుటుంబాలకు ఉచిత ప్రయాణ సదుపాయాలు, గమ్య స్థానాల్లో ఉచిత వసతి వంటి సదుపాయాలను కూడా అందజేస్తాయి. మధ్యస్థాయి ఉద్యోగాల్లో ప్రవేశించే వారికి ప్రారంభంలో కనీసం రూ. 15 వేల నెల జీతం గ్యారంటీ.

మన రాష్ట్రంలో ఎన్‌ఐటీహెచ్‌ఎం...టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్’ దేశవ్యాప్తంగా ప్రముఖంగా నిలిచింది. 2001లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన ఈ సంస్థ.. టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి ప్రతి ఏటా జూన్, జులై నెలల్లో ప్రకటన విడుదల చేస్తారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసే ఈ ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టేందుకు దేశవ్యాప్తంగా పోటీ నెలకొంటోంది. దేశంలోనే తొలిసారి టూరిజం అండ్ హాస్పిటాలిటీ స్పెషలైజేషన్‌తో ఎంబీఏను అందిస్తున్న సంస్థ ఇది. ఇక్కడ చదివినవాళ్లకు ఉపాధి గ్యారెంటీ అనడం అతిశయోక్తి కాదు.

యానిమేషన్ - ఉద్యోగావకాశాలు

యానిమేషన్ - ఉద్యోగావకాశాలు

యువతకు మరో కెరీర్ అవకాశం యానిమేషన్. ఈ పరిశ్రమ వేగంగా ఎదుగుతూ.. వేల సంఖ్యలో ఉద్యోగాలు క ల్పిస్తోంది. ప్రముఖ కంపెనీలు యానిమేషన్ కార్యకలాపాలకు భారత్‌ను కేంద్రంగా
చేసుకుంటున్నాయి. క్రియేటివిటీ, టాలెంట్ ఉన్న యువతకు యానిమేషన్ మంచి కెరీర్‌గా నిలుస్తుంది. ఇందులో పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం...
యానిమేషన్ అంటే:వస్తువు, లేదా పాత్రకు ప్రాణం పోసేదే యానిమేషన్. జంతువుల లేదా మనుషుల చిత్రాలను కంప్యూటర్ ద్వారా కదిలిస్తూ.. గేమ్స్, సినిమాలు, కార్టూన్‌లను రూపొందించడమే యానిమేషన్. యానిమేషన్‌లో టూ డెమైన్షనల్ యానిమేషన్(2డి), త్రీ డెమైన్షనల్ యానిమేషన్(3డీ) ముఖ్యమైనవి. వాటితోపాటు క్లె యానిమేషన్, పప్పెట్ యానిమేషన్, శాండ్ యానిమేషన్ కూడా ఉన్నాయి. 2డి, 3డి యానిమేషన్‌లను డిజిటల్‌గా రూపొందించొచ్చు.
యానిమేటర్లు ఏం చేస్తారు:ఐడియా డెవలప్‌మెంట్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్... యానిమేషన్ ప్రక్రియ ఇలా సాగుతుంది. ఐడియా డెవలప్‌మెంట్‌లోనే పాత్రల రూపకల్పన జరుగుతుంది. ఐడియాస్‌ను లే అవుట్‌లుగా మార్చుతారు. ఆ తర్వాత స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ బోర్డింగ్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్స్, లే అవుట్ డిజైనింగ్, యానిమాటిక్స్ అండ్ వాయిస్.. ప్రీ ప్రొడక్షన్ కిందకు వస్తాయి. స్కానింగ్, కంపోజింగ్, బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్, కలరింగ్ పని పూర్తయ్యాక... సౌండ్ రికార్డింగ్స్, కలర్ ఎడిటింగ్, టెస్టింగ్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో... ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కలర్ కరెక్షన్, కంపోజింగ్, వాయిస్, మ్యూజిక్ ఎడిటింగ్ అండ్ రెండరింగ్ పని జరుగుతుంది.
యానిమేషన్ కోర్సులు:దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు యానిమేషన్‌లో పీజీ,-గ్రాడ్యుయేషన్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు యానిమేషన్ స్టైల్స్, టెక్నిక్స్‌కు సంబంధించి స్టాప్ మోషన్ యానిమేషన్, రాట్‌స్కోపింగ్, కంప్యూటర్ జనరేటెడ్ 3డి, 2డి యానిమేషన్, క్లేమోషన్, ఫొటోషాప్, హ్యూమన్ అనాటమీ, డ్రాయింగ్‌ల్లో ప్రత్యేక తర్ఫీదునిస్తున్నాయి.

యానిమేటర్‌కు అర్హతలు:
బేసిక్ స్కెచింగ్ స్కిల్స్, యానిమేషన్ పట్ల అమితాసక్తి ఉంటే సరిపోతుంది. శిక్షణ మాత్రం తప్పనిసరి. యానిమేషన్‌కు అవసరమైన స్కిల్స్‌కు పదునుపెట్టి అభ్యర్థిని ప్రొఫెషనల్ యానిమేటర్‌గా తయారు చేయడంలో ఈ శిక్షణ దోహదం చేస్తుంది. మంచి ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవాలంటే... యానిమేషన్‌లో డిప్లొమా, లేదా డిగ్రీ చేస్తే మేలు. వీటిలో చేరేందుకు కనీస అర్హత 10+2. డిగ్రీ అభ్యర్థులు యానిమేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వంటివి మాత్రం ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్స్‌కు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నాయి.
స్కిల్స్:యానిమేషన్‌లో రాణించాలనుకునే అభ్యర్థికి సృజనాత్మకత, కల్పనాశక్తి ఉండాలి. దాంతోపాటు డ్రాయింగ్‌పై, స్కెచ్చింగ్‌పై ఆసక్తి, అవగాహన ఉంటే మంచిది. పనిపట్ల నిబద్ధత, క్రమశిక్షణ, సహనం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. కంప్యూటర్ డిజైన్ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన, సీ++, జావా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే.. అదనపు అర్హత. దాంతోపాటు ఫొటోగ్రఫీ, లైటింగ్ గురించి కూడా తెలిసుండాలి.
ఉద్యోగావకాశాలు:నైపుణ్యాలున్న యానిమేటర్లకు దేశ విదేశాల్లో అనేక ఉద్యోగావకాశాలున్నాయి. అడ్వర్‌ైటైజింగ్, టీవీ బ్రాడ్‌కాస్టింగ్, ఫిల్మ్, గేమ్స్, ఆర్కిటెక్చర్, వెబ్, ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అప్లికేషన్స్, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్స్, మెడికల్ ఇమేజింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అండ్ ఇంజనీరింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో రోజురోజుకూ అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఒక్కో యానిమేషన్ సినిమాకు 500 మంది యానిమేటర్ల అవసరం ఉంటుంది. అందుకే చిత్ర పరిశ్రమలో యానిమేటర్ల అవసరాలు పెరుగుతున్నాయి.
జీతభత్యాలు:యానిమేషన్ ఉద్యోగాల ప్రత్యేకత మంచి జీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే.. టాలెంట్ ఉంటే ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లకే ఆరంకెల జీతం సొంతం చేసుకోవచ్చు. ట్రైనీ, లేదా జూనియర్ యానిమేటర్‌గా రూ.8,000-రూ.15,000లతో ప్రారంభమవుతుంది. మూడు నుంచి ఐదేళ్ల అనుభవంతో రూ. 25000- రూ. 40,000ల వరకూ పొందొచ్చు. మరికొంత అనుభవం సంపాదించాక రూ.50,000-రూ.60,000 వరకూ జీతాలు పెరుగుతాయి.
శిక్షణా సంస్థలు:జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనిమేషన్ ప్రత్యేకాంశంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
10+2 ఉత్తీర్ణులు అర్హులు.
వెబ్‌సైట్: http://jnafau.ac.in
ఎరీనా యూనిమేషన్ అకాడెమీ
www.arenaanimationacademy.com

కలర్‌చిప్స్ ఇండియూ
www.colorchipsindia.com

కాలిబర్ ఐటీ సొల్యూషన్స్
www.caliberitsolutions.com

పికాసో యూనిమేషన్
www.picasso.co.in

ప్రిజమ్ మల్టీమీడియూ
www.prismmultimedia.com
ఒపెల్ మల్టీమీడియూ
రేస్ ది యూనిమేషన్
www.raceindia.com
బిగ్ ఫిష్ స్టూడియోస్
www.bigfishanimations.com
నిమ్స్‌మె

స్వయం ఉపాధికి మార్గం.. సెట్విన్ కోర్సులు

స్వయం ఉపాధికి మార్గం.. సెట్విన్ కోర్సులు

స్వయం ఉపాధితో నిరుద్యోగ సమస్యను చాలావరకు తగ్గించే ఉద్దేశంతో 1978లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సెట్విన్(సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్). స్వయం ఉపాధి పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది సెట్విన్. పది.. అంతకంటే తక్కువ విద్యార్హతలు ఉన్నవారికి కూడా సరికొత్త ఉపాధి మార్గం చూపడంలో సెట్విన్ పాత్ర మరువలేనిది. నిరుద్యోగ యువత మొదలు వ్యాపార రంగంపై అవగాహన, ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరికి ఉపాధి కల్పించడంలో ఈ సంస్థ ఎనలేని పాత్ర పోషిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తూ.. పది, ఇంటర్, అంతకంటే తక్కువ చదువుకున్న వారికి అనేక స్వయం ఉపాధి మార్గాలు చూపుతోంది!!

సెట్విన్‌లో కోర్సులు నేర్చుకున్నవారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా డేటాఎంట్రీ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్లు, మోటార్ మెకానిక్ కోర్సులు నేర్చుకున్నవారికి ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, రిలయన్స్ ఫ్రెష్, మోర్, మెట్రోలాంటి పెద్ద సంస్థలతోపాటు చిన్నచిన్న కంపెనీలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆసక్తికర విషయమేమంటే... కంపెనీలు ఈ స్కిల్స్ ఉన్న అభ్యర్ధులు కావాలంటూ సెట్విన్‌ను తరచూ సంప్రదిస్తుంటాయి. నేర్చుకోవాలనే తపన, జీవితంలో స్థిరపడాలన్న జిజ్ఞాస ఉన్నవారు సెట్విన్‌లో చేరితే ఉద్యోగం లేదా స్వయం ఉపాధి ద్వారా జీవితంలో త్వరగా స్థిరపడొచ్చు. కోర్సు పూర్తి చేసుకున్నవారు సొంతంగా ఏదైనా చేయూలనుకుంటే రుణ సదుపాయం గురించి కూడా కావాల్సిన సమాచారాన్ని సెట్విన్‌లో అందిస్తున్నారు.

శిక్షణ...ఆపై ఉపాధి:సెట్విన్ నిరుద్యోగులకు అనేకరకాల వినూత్న కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. వికలాంగులు, మహిళలు, విద్యార్థులు, ఉన్నత చదువులు చదువుకున్న వారికి సైతం ప్రయివేట్ రంగంలో పలు విభాగాల్లో అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ, మినీబస్ ట్రాన్స్‌పోర్టు పథకాలు, కంప్యూటర్ శిక్షణ, వేజ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్, ఉత్పాదక పథకాలు, ట్రేడింగ్, స్వయం ఉపాధి పథకాలతోపాటు ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన వారికి పలు ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చేవిధంగా ప్రత్యేకంగా ప్లేస్‌మెంట్ సెల్ నిర్వహిస్తోంది.

అందిస్తోన్న కోర్సులు:

మూడు నెలల కంప్యూటర్ కోర్సులు: ఎంఎస్ ఆఫీస్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్, కంప్యూటర్ ఎయిర్‌లైన్ టికెటింగ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ(అడ్వాన్స్‌డ్), యూనిక్స్, సీ, సీ++ మొదలైనవి.

45 రోజుల కోర్సులు: కాల్‌సెంటర్ ట్రైనింగ్, కంప్యూటర్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రాం.

ఆరు నెలల టెక్నికల్ కోర్సులు (ఏడో తరగతి విద్యార్థులకు):
 ఆటో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, గోల్డ్ పాలిషింగ్ (3 నెలలు), ఆరు నెలల సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మెషినరీ వర్క్, ప్లంబింగ్, కార్పెంటరీ కోర్సులకు ఏడో తరగతి పాస్, లేదా ఫెయిల్ అయినా అర్హులే.

పదోతరగతి అర్హతతో వృత్తివిద్యా కోర్సులు:రేడియో అండ్ టీవీ(బ్లాక్ అండ్ వైట్, కలర్), (9 నెలలు); రేడియో, టీవీ కలర్ బ్లాక్ అండ్‌ వైట్ (6 నెలలు); కలర్ టీవీ( 3 నెలలు), రిఫ్రిజిరేషన్ (6 నెలలు)... ఈ కోర్సులకు టెన్త్ పాస్, లేదా ఫెయిల్ అయినా అర్హులే. టైప్ రైటింగ్ (6 నెలలు); టెలిఫోన్ ఆపరేటర్ (45 రోజులు); సెల్‌ఫోన్ రిపేరింగ్ (6 నెలలు); షార్ట్‌హ్యాండ్(6 నెలలు); సివిల్ డ్రాఫ్ట్‌మెన్ షిప్ (6 నెలలు); ఆర్కిటెక్చురల్ డ్రాఫ్ట్‌మెన్‌షిప్ (6 నెలలు); స్పోకెన్ ఇంగ్లిష్ (3 నెలలు); జ్యుయెలరీ మేకింగ్ (6 నెలలు); సర్టిఫికేట్ కోర్సు ఇన్ డ్రాఫ్ట్‌మెన్ సివిల్ (ఏడాది) మొదలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మహిళల కోసం: మహిళలకు ఉపాధి కల్పించే విధంగా కటింగ్ అండ్ టైలరింగ్, బ్యూటీషియన్, జిగ్‌జాగ్, బంజారా అండ్ మిర్రర్ వర్‌‌క, ఫ్యాషన్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ బ్యూటీకేర్ వంటి ఎన్నో కోర్సులు ఉన్నాయి.

జీతాలు భారీగానే:వివిధ విభాగాల కింద సెట్విన్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 140 కోర్సుల వరకు నిర్వహిస్తోంది. వీటిలో అత్యధిక శాతం ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించడంతో పాటు సొంతంగా ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలుకల్పిస్తాయి. సెట్విన్ కోర్సుల్లో అధిక శాతం మెడికల్, హోటల్ రంగాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కోర్సులు పూర్తిచేస్తే దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నర్సుల నుంచి ఆస్పత్రి నిర్వహణ, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎక్స్‌రే, ఇతర అవయవాల స్కానింగ్ విభాగాల్లో తక్షణం ఉపాధి పొందే అవకాశముంది. ఇప్పుడు దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో పది, ఇంటర్ పూర్తి చేసి ఈ కోర్సులు చదివిన వారికి మంచి డిమాండ్ ఉంది. నెలకు రూ.12 వేలకు పైగా ఆదాయం పొందొచ్చు. దీనికితోడు మహిళల కోసం ప్రవేశపెట్టిన బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల ద్వారా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సొంతంగా వ్యాపారం చేయడంతోపాటు రూ.6వేల నుంచి రూ.9వేల వరకు ఆదాయం సంపాదించవచ్చు. చివరకు ఏడో తరగతి పూర్తిచేసిన వాళ్లు సైతం కార్పెంటర్లు, మేస్త్రీలుగా అవకాశాలు దక్కించుకోవచ్చు. అంతేకాదు.. ఫైర్ సర్వీసులో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు పూర్తిచేస్తే బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల కాంప్లెక్సులు, ప్రయివేట్ పారిశ్రామిక సంస్థల్లో అవసరం మేరకు మంచి జీతంతో ఉపాధి లభిస్తుంది.
వెబ్‌సైట్: www.setwinapgov.org

వృత్తి నైపుణ్యాలకు వేదిక ‘ఐటీఐ’ఏదైనా దేశ ఆర్థిక ప్రగతి వేగం అక్కడి మానవ వనరుల నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. మంచి వృతి నైపుణ్యాలున్న మానవ వనరులు ఎక్కువగా ఉంటే... ఆ దేశ ప్రగతి వేగవంతమవుతుంది. ఆ సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఎంత ఎక్కువగా వృత్తి నైపుణ్యాలుంటే.. అంత త్వరగా, అంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణతో జాబ్ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్ సొంతమవుతారుు. దాంతో స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది.

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఐటీఐ)లు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ (ఐటీసీ)లు.. టెక్నికల్ రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(డీజీఈటీ), మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ పర్యవే క్షణలో పనిచేస్తాయి. దేశవ్యాప్తంగా 9400లకు పైగా ఐటీఐల్లో 3 లక్షలకు పైగా సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 2850 ఐటీసీల్లో 3,05,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 500 ఐటీఐలను సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల కింద ప్రపంచబ్యాంక్ సహాయంతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
అర్హత: పదో తరగతి.

మన రాష్ట్రంలో 733: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం 96 జనరల్ ఐటీఐలు, 21 మహిళల ఐటీఐలు నడుస్తున్నాయి. అదే విధంగా 608 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. 33 ఇంజినీరింగ్ ట్రేడ్‌లు, 8 నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్‌లలో శిక్షణ ఇస్తున్నారు. 423 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్లు(ఐటీసీ)ప్రైవేట్ రంగంలో ఉన్నారుు.

ఐటీఐ- ఇంజినీరింగ్ ట్రేడ్స్(రెండేళ్ల కోర్సు): ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, రేడియో అండ్ టెలివిజన్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎరుయిర్ కండీషనింగ్, వైర్‌మెన్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రోప్లాటర్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, పెయింటర్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, మాసన్ (బిల్డింగ్ కనస్ట్రక్షన్)

నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్స్: స్టెనోగ్రఫీ, సెక్రటేరియల్ ప్రాక్టీస్, డ్రెస్‌మేకింగ్, కట్టింగ్ అండ్ టైలరింగ్, బుక్ బైండింగ్, హ్యాండ్ కంపోసర్, కార్పెట్ వేవింగ్.

అప్రెంటీస్‌షిప్: ఐటీఐ పాసయ్యాక అభ్యర్థి సంబంధిత జిల్లా అసిస్టెంట్ అప్రెంటీస్‌షిఫ్ అడ్వైజర్ వద్ద తన పేరును నమోదు చేసుకోవాలి. అప్రెంటీస్‌షిప్ అడ్వైజర్ ట్రేడ్‌ల వారీగా, మెరిట్ ఆధారంగా, సీనియారిటీ ఆధారంగా జాబితాను తయారు చేస్తారు. ఆయా సంస్థలు ఈ జాబితా నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. అప్రెంటీస్‌షిప్ సమయంలో స్టైఫండ్ లభిస్తుంది.

ఉపాధి: ఐటీఐ కోర్సులను పూర్తిచేసిన వారికి నేడు ఉపాధికి ఢోకా లేదు. వెల్డర్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్ వంటి కోర్సులతోపాటు తాజాగా విభిన్న నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే అంశంపై ఐటీఐలు దృష్టిసారించారుు. ఉపాధి అవకాశాలు మెరుగవుతుండటంతో విద్యార్థులు ఐటీఐ కోర్సుల పట్ల మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏటా 20 వేల మందికి, ప్రైవేట్ రంగంలో 80 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ ఐటీఐ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు.

సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్: ఐటీఐలను సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లుగా తయూరుచేయూలనే ఉద్దేశంతో కేంద్రం శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా మొదటి సంవత్సరం సంప్రదాయ ట్రేడ్లలో శిక్షణ ఇస్తారు. అనంతరం ఆరు నెలలపాటు ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత ఆరు నెలలు పరిశ్రమల్లో శిక్షణ ఇస్తారు.

ఒకేషనల్ కోర్సులువృత్తి విద్య నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ నిర్మూలనకు, స్వయం ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. పదో తరగతి తర్వాత ఒకేషనల్ కోర్సుల ద్వారా స్వల్ప కాలంలోనే ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఉన్నత విద్యకూ ఒకేషనల్ కోర్సులు అవకాశం కల్పిస్తున్నాయి.
మన రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్.. పదో తరగతి పాసైన విద్యార్థుల కోసం 31 రకాల ఒకేషనల్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది.

ప్రవేశం ఎలా: పదో తరగతి ఫలితాలు వెలువడగానే ఒకేషనల్ కోర్సుల్లోకి ప్రవేశాల ప్రక్రియను ఇంటర్మీడియెట్ వృత్తి విద్యా విభాగం చేపడుతుంది. అందుకు సంబంధించి ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. స్వల్పకాలిక కోర్సుల్లో ఏడాదంతా ప్రవేశాలు జరుగుతూనే ఉంటాయి.

స్వల్పకాలిక కోర్సులు: ఇంటర్మీడియెట్ విద్యా డెరైక్టర్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర వృత్తి విద్యా సంస్థ 58 స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తోంది. పదో తరగతి/ఇంటర్మీడియెట్‌లో ఫెయిలైన వారికోసం, డ్రాప్ అవుట్స్ కోసం ఈ కోర్సులను ఉద్దేశించారు. 3 నెలలు, 6 నెలలు, 9 నెలల వ్యవధి గల కోర్సులివి.

రెండేళ్ల కోర్సులు: బిజినెస్-కామర్‌‌స: అకౌంటింగ్-ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, బేసిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మార్కెటింగ్ సేల్స్‌మన్‌షిప్, ఎక్స్‌పోర్‌‌ట- ఇంపోర్‌‌ట ప్రాక్టీసెస్-డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్‌‌స, ఆఫీస్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, పర్చేజింగ్ - స్టోర్ కీపింగ్.

హెల్త్-పారామెడికల్:
 మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మగ), మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఆడ), డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్,. ఆప్తాల్మిక్ టెక్నీషియన్, ఎక్స్‌రే టెక్నీషియన్, క్లినికల్ అసిస్టెంట్, ఫిజియోథెరపీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్.

హోమ్ సైన్‌‌స: కమర్షియల్ గార్మెంట్ డిజైన్ - మేకింగ్, క్రష్ -ప్రీ స్కూల్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, హెల్త్ కేర్- బ్యూటీకల్చర్, కేటరింగ్- రెస్టారెంట్ మేనేజ్‌మెంట్,. ఇన్‌స్టిట్యూషనల్ హౌస్ కీపింగ్.

ఇంజనీరింగ్ - టెక్నాలజీ: రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్‌‌స, రేడియో, టి.వి.టెక్నీషియన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, వాటర్ సప్లై-శానిటరీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్-సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, డి.టి.పి.- ప్రింటింగ్ టెక్నాలజీ.

అగ్రికల్చర్:డైరీయింగ్, సెరికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, ఫిషరీస్, హార్టికల్చర్, సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ, సాయిల్ సైన్‌‌స - ప్లాంట్ ప్రొటెక్షన్, వాటర్ షెడ్ మేనేజ్‌మెంట్ - సాయిల్ కన్సర్వేషన్.

హ్యుమానిటీస్:కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, టూరిజం ట్రావెల్ టెక్నిక్స్, కమర్షియల్ ఆర్‌‌ట.

కోర్సుల తీరు: 
ఒకేషనల్ కోర్సులో థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 50 శాతం మార్కులు థియరీకి, 50 శాతం మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉంటాయి.

బ్రిడ్జి కోర్సుతో లాభాలెన్నో: ఒకేషనల్ విద్యార్థుల ఉన్నత విద్యకు బ్రిడ్జ్ కోర్సు పునాది. ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సులు పాసైన వారు.. బీఏ/బీకామ్‌లలో అడ్మిషన్ తీసుకోవచ్చు. బ్రిడ్‌‌జ కోర్సుతో బీఎస్సీలో చేరొచ్చు. బ్రిడ్జ్ కోర్సుతో ఎంసెట్‌కు హాజరై ఇంజనీరింగ్/మెడిసిన్‌లలో కూడా చేరొచ్చు. ఇంజనీరింగ్ ట్రేడ్స్‌లో ఒకేషనల్ కోర్సులు పాసైనవారు బ్రిడ్జ్ కోర్సుతో పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో 10 శాతం కోటా కింద రెగ్యులర్/ కరస్పాండెంట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. అదేవిధంగా ఎం.పి.హెచ్.డబ్ల్యూ(ఎఫ్) కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్‌లో.. ఎంఎల్‌టీ కోర్సు పాసైన విద్యార్థులు బీఎస్సీ ఎంఎల్‌టీలో చేరొచ్చు. డెంటల్ హైజెనిస్ట్, క్లినికల్
అసిస్టెంట్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి హెల్త్ అండ్ పారా మెడికల్ కోర్సులు పాసైన విద్యార్థులు బ్రిడ్జ్ కోర్సు, ఎంసెట్ ద్వారా మెడికల్ కోర్సుల్లో చేరొచ్చు. అగ్రికల్చర్, హోంసైన్స్ ఒకేషనల్ కోర్సులు చదివిన వారు బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో చేరేందుకు అర్హులు. వృత్తివిద్యా శిక్షణ పొంది ఉత్తీర్ణులైన వారికి మరింతగా నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు వీలుగా అప్రెంటీస్‌షిప్ చేసే అవకాశం కూడా ఉంది. అప్రెంటీస్‌షిప్ పీరియడ్‌లో స్టైఫండ్ కూడా లభిస్తుంది.
వెబ్‌సైట్: www.bieap.gov.in

కెరీర్‌ ఎంపిక ఉపాధికి మార్గం

కెరీర్‌ ఎంపిక ఉపాధికి మార్గం.. 

మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కొంత స్పష్టతతో ముందడుగు వేస్తారు. కాని సరైన ర్యాంకు రాని విద్యార్థుల్లో సందిగ్దత, గందరగోళం నెలకొంటుంది.చూస్తుండగానే కాలం ఇట్టే గడిచిపోతుంది. వేసవి సెలవులు ముగిసి.. కొత్త విద్యా సంవత్సరానికి సంసిద్ధం కావాల్సి సమయం వచ్చేస్తుంది. అందుకే ఆయా కోర్సుల్లో, కాలేజీల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందే విద్యార్థి తన గమ్యం, భవిష్యత్ లక్ష్యాలు, తన శక్తిసామర్థ్యాలు, బలాలు బలహీనతలు దృష్టిలో పెట్టుకొని కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలి.
కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు విద్యార్థికి కొంత ఆందోళన, సందిగ్ధత సహజమే! చేరాలనుకుంటున్న కోర్సు తనకు సరిపోతుందా.. కెరీర్ పరంగా సరైన నిర్ణయం తీసుకుంటున్నానా..ఒక వేళ సఫలం కాకపోతే నాకున్న ప్రత్యామ్నాయ మార్గం ఏంటి.. స్నేహితులు ఎలాంటి కోర్సుల్లో చేరుతున్నారు.. నేను ఎంచుకున్న కోర్సు వారికి నచ్చుతుందా.. నా తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టు నేను రాణించగలనా.. ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులను వెంటాడుతుంటాయి. అన్నింటికీ సమాధానం.. విద్యార్థి తనకు సరిపోయే భద్రమైన కెరీర్‌ను ఎంచుకోవడమే!!

ఆసక్తి.. సామర్థ్యం :మిగతా అన్ని అంశాల కంటే... విద్యార్థి కెరీర్ ఎంపికలో తన ఆసక్తికి, అభిరుచికి పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు సదరు కోర్సు/కెరీర్‌లో రాణించే శక్తిసామర్థ్యాలు తనకు ఉన్నాయో లేదో కూడా పరిశీలన చేసుకోవాలి. మీకు ఒక రంగంపై విపరీతమైన ఆసక్తి ఉంది.. కాని ఆ రంగంలో రాణించే సామర్థ్యం లేకుంటే చేసిన శ్రమ అంతా వృథా అవుతుంది. ఉదాహరణకు మీకు కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనే ఆసక్తి ఉంది. కాని మ్యాథమెటిక్స్ అంటే భయం... ఈ సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. మ్యాథ్స్‌పై పట్టు లేకుండా.. కంప్యూటర్ ఇంజనీర్‌గా రాణించడం కష్టమనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఒక అంశంపై ఎంత ఆసక్తి ఉన్నా.. అందులో విజయం సాధించేందుకు అవసరమైన సామర్థ్యాలు లేకుంటే... దీర్ఘకాలంలో ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకోవడం సాధ్యంకాదు.

సమగ్ర అధ్యయనం :ఏదైనా కోర్సును ఎంచుకునే ముందు... ఆయా కోర్సు ద్వారా అందుబాటులోకి వచ్చే కెరీర్ గురించి లోతైన ఆలోచన, అధ్యయనం చేయాలి. అరకొర సమాచారంతో కెరీర్‌ను ఎంచుకుంటే... ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి విద్యార్థి తనముందున్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలపైనా సమగ్ర అధ్యయనం చేయాలి. అడ్మిషన్స్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా.. నింపాదిగా అన్ని రకాల కోర్సులు, కెరీర్ ఆఫ్షన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

వాస్తవ పనిపై అవగాహన :రాబోయే కొన్ని దశాబ్దాలపాటు కొనసాగాల్సిన కెరీర్‌ను ఎంచుకునేటప్పుడు విద్యార్థి ఆచితూచి అడుగేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఎంచుకున్న కెరీర్‌లో వాస్తవంగా చేయాల్సిన పని గురించి క్షేత్ర స్థాయి పరిశీలన చేయడం మేలు చేస్తుంది. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకుంటున్న విద్యార్థి.. వాస్తవ పని పరంగా మెకానికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారో తెలుసుకోవాలి. అందుకోసం ఆయా రంగంలో పనిచేస్తున్న వారి సలహాలు అడగాలి. సహాయం తీసుకోవాలి. ఏదైనా సంబంధిత సంస్థకు వెళ్లి మెకానికల్ ఇంజనీర్ల జాబ్ ప్రొఫైల్‌తోపాటు పనితీరును గమనించాలి. తద్వారా సదరు మెకానికల్ ఇంజనీర్‌లు చేస్తున్న పని తనకు సరిపోతుందా... ఆయా పని పూర్తిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలు, దృక్పథం తనకు ఉన్నాయో లేదో అంచనాకు రావచ్చు. అంతేకాకుండా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చదవాల్సిన సబ్జెక్టులు ఏమిటి... ఆయా సబ్జెక్టులను తాను ఆసక్తిగా చదవగలనా లేదా కూడా పరిశీలించుకోవడం మేలు. కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఆస్సలు ఆసక్తి కలిగించవు. ఎంత ప్రయత్నించినా ఆ సబ్జెక్టుల్లో నెగ్గుకురావడం కష్టంగా అనిపిస్తుంది.

ప్రతి ఒక్కరూ విభిన్నం..ప్రతి ఒక్క విద్యార్థి తమ శక్తి సామర్థ్యాలు, అభిరుచులు, నైపుణ్యాలు, వ్యక్తిత్వం, దృక్పథం పరంగా ఎంతో భిన్నం. కాబట్టి తోటి వారితో పోల్చుకోవడం సరికాదు. స్నేహితులు ఎలాంటి కోర్సుల్లో చేరుతున్నారు.. వారి అభిప్రాయాలు ఏంటి.. అనేదానితో ప్రభావితం కాకుండా స్వీయ నిర్ణయం తీసుకోవాలి. జీవిత కాలం కొనసాగాల్సిన కెరీర్ కాబట్టి విద్యార్థి పూర్తిగా తన లక్ష్యాలు, తన అభిరుచులు, శక్తిసామర్థ్యాలపైనే దృష్టిసారించి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని స్నేహితులు ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు కాబట్టి మనం కూడా ఇష్టమున్నా లేకున్నా అదే కోర్సులో చేరాలనుకోవడం సరికాదు.

సలహా మంచిదే..అనేక కెరీర్ మార్గాలు కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అనంత అవకాశాల ప్రపంచంలో.. ఏదో ఒక కోర్సును ఎంపిక చేసుకోవడం అంత తేలిక కాదు. గతంలో ఏవో రెండు మూడు కెరీర్ అవకాశాలు మాత్రమే కనిపించేవి. నేటి టెక్నాలజీ యుగంలో అనేక మార్గాలు ఎదురుగా ఉండటం.. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను మరింత గందరగోళానికి గురి చేస్తోంది. కాబట్టి అలాంటి సందర్భంలో నిపుణుల సూచనలు, సలహా తీసుకుంటే.. వారు విద్యార్థి వ్యక్తిత్వ లక్షణాలు, దృక్పథం, అభిరుచులను దృష్టిలో పెట్టుకొని సరైన సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది.

అదే అంతిమం కారాదు..విద్యార్థులు కెరీర్ నిర్ణయం పరంగా కొంత సరళంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంతో విలువైన సమయం, డబ్బు వెచ్చించిన తర్వాత కూడా.. సదరు కోర్సు తనకు నప్పదు అనుకుంటే.. మరో కెరీర్‌కు మారేందుకు, మరో కోర్సులో చేరేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని పేర్కొంటున్నారు. ఒక కోర్సులో చేరాక ముందుకు వెళ్లడం కష్టంగా అనిపిస్తే.. మధ్యలోనే మరో నచ్చిన రంగంవైపు వెళ్లే ఆలోచన చేయాలని సలహా ఇస్తున్నారు. నచ్చకపోయినా, రాణించే అవకాశం లేదని పూర్తిగా అర్థమైనా.. అదే కోర్సులో కొనసాగడం సరికాదన్నది నిపుణుల అభిప్రాయం. అంతిమంగా కెరీర్ నిర్ణయం తీసుకునేముందుకు ఆచితూచి అడుగేయడం అన్ని విధాల ఉత్తమం!!

పారామెడికల్ కోర్సులు - అవకాశాలు

పారామెడికల్ కోర్సులు  -  అవకాశాలు


ఆడియోమెట్రీ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ వంటి పారామెడికల్ కోర్సుల ద్వారా మెడికల్ సంబంధిత రంగంలో ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ సంబంధిత పోస్ట్‌లను భర్తీ చేస్తుండటం.. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్య సేవలను చిన్న పట్టణాలకు విస్తరిస్తుండటంతో పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వీరు ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధినీ పొందొచ్చు. పారామెడికల్ అభ్యర్థులకు విదేశాల్లోనూ అవకాశాలు పుష్కలం.

ప్రవేశం: మనరాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ (ఏపీపీఎంబీ) పారామెడికల్ కోర్సులను నిర్వహిస్తోంది. దీనికి అనుబంధంగా ఉన్న వివిధ కళాశాలలు, ఇన్‌స్టిట్యూట్‌లు పారామెడికల్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో ప్రవేశానికి పారామెడికల్ బోర్డ్ ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. కొన్ని కోర్సులకు అర్హత పదో తరగతికాగా, మరికొన్ని కోర్సులకు ఇంటర్మీడియెట్ (బైపీసీ)ను అర్హతగా నిర్ధ్దేశించారు.

కోర్సులు-కెరీర్:ఆడియోమెట్రీ టెక్నీషియన్: చెవి సంబంధిత పరీక్షలు నిర్వహించడం.. వినికిడి లోపం ఏ స్థాయిలో ఉందో నిర్ధారించడం..పుట్టుకతో వచ్చిన వినికిడి సమస్యలను గుర్తించడంలో ఆడియోమెట్రీ టెక్నీషియన్లు డాక్టర్లకు సహాయపడతారు. అంతేకాకుండా ఆయా సమస్యలకు ఆపరేషన్ అవసరమా, లేదా? అనే విషయాన్ని నిర్ధారించడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తారు. రాష్ట్రంలో ఈ కోర్సును 16 కాలేజీలు అందిస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్: హృద్రోగ చికిత్స నిర్వహించే బృందంలో పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్ ది కీలక పాత్ర. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకు సహాయపడటం..ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఉపయోగించే హార్ట్-లంగ్ మెషిన్ ఎంపిక, అమరికలో..పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్‌లు బాధ్యత వహిస్తారు. ఆపరేషన్ తర్వాత రోగికి అన్నివిధాలుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు పెరుగుతుండడంతో వీరి అవసరం పెరుగుతోంది. మనరాష్ట్రంలో ఈ కోర్సును 8 కాలేజీలు అందిస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

రేడియోథెరపీ టెక్నీషియన్: కేన్సర్ సంబంధిత చికిత్సలో రేడియోథెరపీ టెక్నీషియన్లు పాల్పంచుకుంటారు. కేన్సర్ ఏ స్థాయిలో ఉంది? దానికి రేడియేషన్ ఎంత స్థాయిలో ఇవ్వాలి? రేడియేషన్ అవసరం ఉందా, లేదా? అనే అంశాలను వీరే నిర్ణయిస్తారు. ఈ కోర్సును రాష్ట్రంలో 4 కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్: ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, ‘బ్రోంకేసో్కిపీ’ టెస్ట్ చేయడంలో రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌లు సంబంధిత వైద్యులకు సహాయపడతారు. ఈ కోర్సు రాష్ట్రంలో 7 కాలేజీల్లో ఉంది. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

డయాలసిస్ టెక్నీషియన్: అవుట్ పేషంట్ డయాలసిస్ విభాగాల్లో డయాలసిస్ టెక్నీషియన్‌లు కీలక పాత్ర పోషిస్తారు. డయాలసిస్ చేసేటప్పుడు వినియోగించే పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి? ఆ పరికరాల నిర్వహణ, సంబంధిత అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. ఈ కోర్సును రాష్ట్రంలో 7 కాలేజీలు అందిస్తున్నాయి.
కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

మల్టీపర్పస్ హెల్త్ వర్కర్: గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి రోగ నివారణ సంబంధిత కార్యక్రమాల అమల్లో వీరు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఈ కోర్సు రాష్ట్రంలో 209 కళాశాలలు అందిస్తున్నాయి.

బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్: బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహించడంలో వీరి పాత్ర ముఖ్యమైంది. రక్తాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, బ్లడ్‌బ్యాంక్‌కు సంబంధించిన అన్ని రికార్డులు, ఇతర విధులు నిర్వహించడం వీరి ప్రధాన బాధ్యత. ఈ కోర్సు రాష్ట్రంలో 24 కాలేజీల్లో అందుబాటులో ఉంది.

అనస్థీషియా టెక్నీషియన్: శస్త్ర చికిత్స నిర్వహించే రోగికి అన స్థీషియా (మత్తుమందు) ఇవ్వడంలో.. సంబంధిత అంశాల నిర్వహణలో అనస్థీషియా టెక్నీషియన్‌లు డాక్టర్లకు సహాయపడతారు. ఈ కోర్సును రాష్ట్రంలో 17 కాలేజీలు అందిస్తున్నాయి.

మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్: MRI, XRay, CTscan, Ultrasound లాంటి పరీక్షల్లో రేడియాలజిస్ట్‌లకు వీరు సహాయపడతారు. ఈ కోర్సు రాష్ట్రంలో దాదాపు 25 కాలేజీల్లో ఉంది. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

ఫిజియోథెరపీ: వ్యాయామ పరికరాలను అవసరానికనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపీ, మాగ్నటోథెరపీ, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి, లిగమెంట్స్, టెండాన్ సమస్యల పరిష్కారానికి ఫిజియోథెరపిస్టులు అత్యవసరం. అమెరికాలో ఫిజియోథెరపీకి మంచి డిమాండ్ ఉంది. మన రాష్ర్టంలోని 38 కాలేజీల్లో మొత్తం 1815 ఫిజియోథెరపీ సీట్లు ఉన్నాయి. వీటిని ఇంటర్‌లో మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు.

శానిటరీ ఇన్‌స్పెక్టర్: ఇది రెండేళ్ల కోర్సు. కోర్సు పూర్తిచేసినవాళ్లకు పంచాయతీరాజ్, మున్సిపాలిటీల్లో ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి.హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందొచ్చు.

ఎక్స్‌రే, రేడియాలజిస్టు: ఇవి మంచి ఉద్యోగ అవకాశాలున్న కోర్సులు. ఎక్స్ కిరణాలు, అధిక పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను ఉపయోగించి శరీర భాగాల స్కానింగ్, సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ మొదలైనవి నిర్వహించడానికి రేడియాలజీ విభాగంలో శిక్షణ ఇచ్చే రెండేళ్ల కోర్సు ఇది. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లో మార్కుల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి రూ. 10,000 నుంచి రూ.20,000వరకు వేతనాలుంటాయి.
పై అన్ని కోర్సులకూ సంబంధించిన పూర్తి సమాచారం కోసం www.appmb.orgwww.ntruhs.ap.nic.in వెబ్‌సైట్లు చూడొచ్చు

హెల్త్కేర్ నిపుణులు - సువర్ణావకాశాలు

కెరీర్ ఇన్ హెల్త్‌కేర్ - అవకాశాలు   పుష్కలం.


మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ

వ్యాధి నిర్ధారణకు సంబంధించి మెడికల్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించి డాక్టర్‌కు రిపోర్టు అందించేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు. వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షలు నిర్వహించడం వీరి పని. డాక్టర్ రాసే మందులకు వీరిచ్చే రిపోర్టే కీలకం. దీంతో వీరికి అవకాశాలూ పుష్కలం.

కోర్సులు-అర్హతలు:
కోర్సు: డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్‌టీ). మన రాష్ట్రంలో డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ కోర్సు నిర్వహిస్తోంది.
కాల వ్యవధి: రెండేళ్లు.
అర్హత: పదో తరగతి.

కోర్సు: ఎంఎల్‌టీ(మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్)
ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఇంటర్మీడియెట్ బోర్డు ఈ కోర్సును అందిస్తోంది.
కాల వ్యవధి: రెండేళ్లు.
అర్హత: పదోతరగతి.

కోర్సు: బీఎంఎల్‌టీ(బీఎస్సీ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ)
కాల వ్యవధి: మూడేళ్లు
అర్హత: బైపీసీతో ఇంటర్ పూర్తి చేసిన వారు లేదా ఇంటర్ ఒకేషనల్ (ఎంఎల్‌టీ) లేదా డిప్లొమా ఇన్ ఎంఎల్‌టీ చేసిన వారు అర్హులు.

ఎంపిక: ఈ కోర్సులో ప్రవేశానికి ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేస్తుంది. ఇంటర్ సబ్జెక్టుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాష్ట్రంలో కాలేజీలు: 54
మొత్తం సీట్లు: 1905
వెబ్‌సైట్: http://59.163.116.210

ఉన్నత విద్య:

పదో తరగతి తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు పూర్తిచేసినవారు మూడేళ్ల బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సులో చేరొచ్చు.ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఇంటర్మీడియెట్ బోర్డు నిర్వహించే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులు... మూడేళ్ల బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సును అభ్యసించవచ్చు. బ్రిడ్జి కోర్సు పూర్తిచేసి బీఎస్సీ (మైక్రోబయాలజీ), బీఎస్సీ (బయో కెమిస్ట్రీ), బీఎస్సీ (బయోటెక్), బీజడ్‌సీ వంటి కోర్సుల్లోనూ చేరొచ్చు.
  • ఎలాంటి పరీక్ష లేకుండా ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీపీటీ, మేల్ నర్సింగ్, బ్లడ్ బ్యాంకింగ్, ఎనిస్థీషియా, ఆప్తమాలజీ వంటి డిప్లొమా కోర్సులనూ చేయొచ్చు.
  • అత్యంత సున్నిత పరీక్షలను చేసే డీఎమ్‌ఐటీ (డిప్లొమా ఇన్ మెడికల్ ఇమాజినింగ్ టెక్నీషియన్), ఎమ్‌ఆర్‌ఐ, సీటీ స్కాన్‌లకు సంబంధించిన కోర్సులు కూడా చేసుకోవచ్చు. ప్రభుత్వ సహాయంతో ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
కెరీర్:లేబొరేటరీల్లో రోగ నిర్ధారణ, తీవ్రత కోసం నిర్వహించే ప్రాక్టికల్, టెక్నికల్ ప్రయోగాల్లో ఈ కోర్సు చేసినవారు పాల్గొంటారు. వ్యాధులు, ప్రమాదాలు, ఆపరేషన్లతోపాటు శరీరంలో సంభవించే ఇతర మార్పులను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలను వీరు నిర్వహిస్తారు. హాస్పిటల్స్, డయూగ్నస్టిక్ సెంటర్స్, పరిశోధన సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

వేతనాలు: ప్రారంభంలో రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఆశించొచ్చు. ఆ తర్వాత పనిలో అంకితభావం, కష్టించే స్వభావం ద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. లేదంటే సొంతంగా డయాగ్నస్టిక్ సెంటర్ పెట్టుకోవచ్చు.

బీఎస్సీ(ఎంఎల్‌టీ) కోర్సును ఆఫర్ చేస్తున్న కళాశాలలు:మన రాష్ట్రంలో కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సెన్సైస్, మమత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ సెన్సైస్(ఖమ్మం) ... తదితర సంస్థలు బీఎస్సీ(ఎంఎల్‌టీ) కోర్సును ఆఫర్ చేస్తున్నారుు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) కూడా బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్‌టీ) కోర్సులను అంది స్తోంది.
వెబ్‌సైట్: www.ignou.ac.in

పీజీ స్థారుులో ఎంఎల్‌టీని ఆఫర్ చేసే సంస్థలు:శ్రీరామచంద్ర యూనివర్సిటీ, తమిళనాడు
వెబ్‌సైట్: www.srmc.edu

లయోలా కాలేజ్, చెన్నైవెబ్‌సైట్: www.loyolocollege.edu
పద్మశ్రీ ఇన్‌స్టిట్యూషన్స్- బెంగళూరు

బిట్స్ పిలానీ: ప్రఖ్యాత ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్), పిలానీ-ఆఫ్ క్యాంపస్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ విధానంలో శంకర నేత్రాలయు మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్(తమిళనాడు) సహకారంతో ఎంఎస్(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) కోర్సును అందిస్తుంది.
అర్హత: బీఎస్సీ (బయలాజికల్ సైన్స్) లేదా బిట్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు.
ఎంపిక విధానం: రాత పరీక్ష , ఇంటర్వ్యూల ద్వారా