Monday, January 15, 2024

కెరీర్ గ్రోత్‌కు తోడ్పడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్‌

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్(ML) వంటి టెక్నాలజీలు, రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించనున్నాయి. అన్ని రంగాల్లో వీటి పాత్ర కీలకంగా మారనుంది. ఈ రెండు టెక్ స్కిల్స్ అందిపుచ్చుకునే వారికి ఉద్యోగవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గోల్డ్‌మన్ శాక్స్ రిపోర్ట్ ప్రకారం.. రాబోయే కొన్నేళ్లలో ఏఐ టెక్నాలజీ ద్వారా సుమారు 300 మిలియన్ ఉద్యోగాలు ప్రభావితం కావచ్చని అంచనా ఉంది. ఉద్యోగాలను కాపాడుకోవాలంటే ప్రొఫెషనల్స్ సంబంధిత AI నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కెరీర్ గ్రోత్‌కు తోడ్పడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్‌ కొన్ని ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్‌లో కూడా నేర్చుకోవచ్చు. అవేంటో చూద్దాం.


* టెక్నికల్ ఏఐ స్కిల్స్

- ప్రాంప్ట్ ఇంజనీరింగ్

ఏఐ పరిష్కారాలను వేగంగా అభివృద్ధి చేస్తూ, వాటిని అమలు చేసే నైపుణ్యాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు.

- డేటా సైన్స్ అండ్ అనాలసిస్

భారీ డేటాసెట్స్ నుంచి విలువైన సమాచారం, నాలెడ్జ్‌ను సంగ్రహించడం ఈ విభాగంలో భాగంగా ఉంటాయి.

- ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్

పైథాన్, సి++, జావాస్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై పట్టుసాధించాలి.

- మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, అల్జీబ్రా

ఏఐ అప్లికేషన్స్‌ కోసం అవసరమైన మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్‌పై గ్రిప్ పెంచుకోవాలి.

- బిగ్ డేటా టెక్నాలజీ

ప్రకటనలు

భారీ సైజ్ డేటాను హ్యాండిల్ చేయడంలో వినియోగించే టెక్నాలజీలను అర్థం చేసుకోవడం, వాటిపై పనిచేయడం ద్వారా కెరీర్‌లో ముందడుగు వేయవచ్చు.

- మెషిన్ లెర్నింగ్

మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, అప్లికేషన్స్‌కు సంబంధించిన అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్ ప్రస్తుతం తప్పనిసరి అవసరం.

- కాగ్నిటివ్ లెర్నింగ్ అండ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్

హ్యూమన్ కాగ్నిటివ్ సామర్థ్యాలను అనుకరించే AI సిస్టమ్స్, లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌ స్కిల్స్ టెక్ రంగంలోని నిపుణులకు ఉండాలి.

- అప్లైంగ్ ది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(API)

ఏపీఐలు ఉపయోగించి ఏఐ ఫంక్షన్స్‌ను ఇంటిగ్రెట్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ఏఐ ఫ్రేమ్‌‌వర్క్స్ అండ్ అల్గారిథమ్స్‌లో నైపుణ్యం సాధించడం కూడా టెక్ సెక్టార్‌లో కెరీర్ గ్రోత్‌కు ఉపయోగపడతాయి.



* వర్క్‌ప్లేస్ ఏఐ స్కిల్స్

సబ్జెక్ట్ నాలెజ్డ్‌ అందించే వాటితో పాటు వర్క్ ప్లేస్‌లో అలవర్చుకోవాల్సిన కొన్ని స్కిల్స్‌ ఉన్నాయి. హ్యూమన్-మెషిన్ ఇంటరాక్షన్‌లో ఎమోషన్స్‌ను అర్థం చేసుకోవడం, వాటిని హ్యాండిల్ చేసే స్కిల్‌ను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. దీనితో పాటు ఏఐ ఆధారిత వాతావరణంలో ప్రభావవంతమైన కమ్యూనికేషన్, సహకారం, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ అవసరం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, లేటెస్ట్ టెక్నాలజీకి అప్‌డేట్ కావడానికి ఆసక్తి చూపడం తప్పనిసరి.


ఏ రంగంలో పని చేస్తున్నా సరే, సమస్యల పరిష్కారానికి వినూత్నంగా ఆలోచించడం ప్రధాన బాధ్యత. ఉద్యోగులు AI అల్గారిథమ్‌లలో బయాస్ గుర్తించడం, పరిష్కరించడం తెలుసుకోవాలి. AI అవుట్‌పుట్‌లను విమర్శనాత్మకంగా ఎవాల్యుయేషన్ చేయడం, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం, అభివృద్ధి చెందుతున్న AI సాంకేతికతలు, వర్క్‌ఫ్లోలకు అనుగుణంగా మారడం వంటివి ఉద్యోగులకు కీలకం.

* ఆన్‌లైన్‌లో నేర్చుకునే అవకాశం

వర్కింగ్ ప్రొఫెషనల్స్ పైన పేర్కొన్న ఏఐ స్కిల్స్ పెంపొందించుకునేందుకు గూగుల్, కోర్సెరా, యూడెమి (Udemy) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవచ్చు. వీటిల్లో ఉచితంగా లేదా తక్కువ ధరలకు అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. AI- సంబంధిత అంశాలపై పట్టుసాధించడంలో ఈ కోర్సులు కీలకంగా పనిచేస్తాయి. ఫలితంగా జాబ్ మార్కెట్‌లో ఈజీగా ఉద్యోగవకాశాలను సొంతం 

Generative AI and Jobs:

 

Generative AI and Jobs: A global analysis of potential effects on job quantity and quality

The recent study published by ILO assesses the potential global exposure of occupations to Generative AI, particularly GPT-4. It predicts that the overwhelming effect of the technology will be to augment occupations, rather than to automate them. The greatest impact is likely to be in high and upper-middle income countries due to a higher share of employment in clerical occupations. As clerical jobs are an important source of female employment, the effects are highly gendered. Insights from this study underline the need for proactive policies that focus on job quality, ensure fair transitions, and that are based on dialogue and adequate regulation.

A recent study by McKinsey (2023) points to a similar group of “knowledge work” occupations and tasks as having the highest level of exposure, though with a significantly higher suggested level of displacement. WEF’s global survey, focussed on large enterprises, also lists clerical and administrative jobs among occupations with fastest expected declines (WEF 2023). Estimates provided by Goldman Sachs (2023) suggest a slightly higher level of potential automation than our calculations, but with the general conclusion aligning with our main finding that “most jobs and industries are only partially exposed to automation and are thus more likely to be complemented rather than substituted by AI”.

The more moderate effects observed in our estimations stem from several factors. First, we rely on ISCO-08 as the source of tasks and occupations, which is more adequate for a study with a global character than the US-oriented O*NET database. Second, the application of ILO’s country-level employment statistics adds important nuance to the actual number of jobs that exists in those categories, bringing out income-based differences that affect the final employment effects at the global level. Third, we do not attempt to make predictions on the evolution of the technology. While the growing capabilities of generative AI and the range of secondary applications that can be built on top of this technology are likely to increase the numbers of jobs in both the augmentation and automation categories identified in our paper, our analysis suggests that the general contours of transformation identified in this study will remain valid for the coming years.

Ultimately, we argue that in the realm of work, generative AI is neither inherently good nor bad, and that its socioeconomic impacts will largely depend on how its diffusion is managed. The questions of power balance, voice of the workers affected by labour market adjustments, respect for existing norms and rights, and adequate use of national social protection and skills training systems will be crucial elements for managing AI’s deployment in the workplace. Without proper policies in place, there is a risk that only some of the well-positioned countries and market participants will be able to harness the benefits of the transition, while the costs to affected workers could be brutal. Therefore, for policy makers, our study should not read as a calming voice, but rather as a call for harnessing policy to address the technological changes that are upon us.

(With courtesy to  ILO)  It was accessed from: https://www.ilo.org/static/english/intserv/working-papers/wp096/index.html