బెంగళూరు (Bangalore)లోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (National Law School of India University) (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) - ఎల్‌ఎల్‌బీ ఆనర్స్, ఎంపీపీ, పీహెచ్‌డీ (Phd) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌లకు నిర్దేశించిన అడ్మిషన్ టెస్ట్‌ల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
ఎల్‌ఎల్‌బీ ఆనర్స్
ఇది పూర్తిగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. దీని వ్యవధి మూడేళ్లు. ఏడాదికి మూడు చొప్పున మొత్తం తొమ్మిది సెమిస్టర్లు ఉంటాయి. ఏడాదికి 48 చొప్పున మొత్తం 144 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లో 120 సీట్లు ఉన్నాయి. సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్(ఎన్‌ఎల్‌ఎస్‌ఏటీ-ఎల్‌ఎల్‌బీ) 2023 ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రోగ్రామ్ వివరాలు: ఇందులో కోర్ కోర్సులు, ఎలక్టివ్ కోర్సులు ఉంటాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా క్లాస్ రూం టీచింగ్, అసైన్‌మెంట్‌లు, రిసెర్చ్ పేపర్‌లు, ప్రజంటేషన్స్, క్లాస్ పార్టిసిపేషన్, కేస్ స్టడీస్, జ్యుడీషియల్ డెసిషన్స్, స్కాలర్లీ రైటింగ్స్, క్లాస్ రూం డిస్కషన్స్, ఇంటర్న్‌షిప్‌లు నిర్వహిస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 45 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అర్హులే. వీరు డిసెంబరు 31 నాటికి డిగ్రీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి.
ఎన్‌ఎల్‌ఎస్‌ఏటీ-ఎల్‌ఎల్‌బీ 2023 వివరాలు: ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. ఒక్కో పార్ట్‌కు 75 మార్కులు నిర్దేశించారు. మొదటి పార్ట్‌లో అన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే అడుగుతారు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, కరెంట్ అఫైర్స్, క్రిటికల్ రీజనింగ్ అంశాలనుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సమాధానం గుర్తించకపోయినా/ తప్పుగా గుర్తించినా పావు మార్కు కోత విధిస్తారు. రెండో పార్ట్‌లో లీగల్ ఆప్టిట్యూడ్/రీజనింగ్ అంశాల నుంచి సబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. వీటికి సంక్షిప్తంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. మొదటి పార్ట్‌లో జనరల్ అభ్యర్థులకు కనీసం 75 శాతం మార్కులు, రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను(సీటుకు అయిదుగురిని) షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి సంబంధించిన రెండో పార్ట్‌ను మాత్రమే పరిశీలిస్తారు. రెండు పార్ట్‌లలో సాధించిన మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి తుది జాబితా రూపొందిస్తారు.
మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ(ఎంపీపీ)
ఇది రెండేళ్ల వ్యవధిగల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఇందులో సస్టయినబుల్ డెవల్‌పమెంట్, పబ్లిక్ పాలసీ అంశాలు ప్రధానంగా ఉంటాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా క్లాస్ రూం డిస్కషన్స్, ఫీల్డ్ ఎక్స్‌పోజర్స్, ఇంటర్న్‌షిప్, రిసెర్చ్ డిజర్టేషన్ ఉంటాయి. ప్రోగ్రామ్ మొత్తానికి 84 క్రెడిట్స్ నిర్దేశించారు. కోర్ కోర్సులకు 50, ఎలక్టివ్ కోర్సులకు 16, ఫీల్డ్ వర్క్‌కు 2, ప్రాజెక్ట్ వర్క్‌కు 2, సెమినార్ కోర్సులకు 4, డిజర్టేషన్‌కు 10 క్రెడిట్స్ ప్రత్యేకించారు. సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ(ఎన్‌ఎల్‌ఎ్‌సఏటీ-ఎంపీపీ)2023, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీ సం 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసేవారు కూడా అర్హులే.
ఎన్‌ఎల్‌ఎస్‌ఏటీ-ఎంపీపీ 2023 వివరాలు: ఇందులో రెండ్ పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌కు 60 మార్కులు నిర్దేశించారు. ఇందులో అన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సమాధానం గుర్తించకపోయినా/ తప్పుగా గుర్తించినా పావు మార్కు కోత విధిస్తారు. రెండో పార్ట్‌కు 25 మార్కులు కేటాయించారు. ఇందులో పబ్లిక్ పాలసీకి సంబంధించిన సబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. మొదటి పార్ట్‌లో నిర్దేశించిన ప్రకారం మార్కులు సాధించినవారిని మెరిట్ ప్రకారం 1:5 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి సంబంధించిన రెండో పార్ట్‌ను మాత్రమే పరిశీలిస్తారు. రెండు పార్ట్‌లలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి 15 మార్కులు నిర్దేశించారు. మూడు దశల్లో సాధించిన మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల తుది జాబితా రూపొందిస్తారు.
పీహెచ్‌డీ
ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. లా, ఇంటర్‌డిసిప్లినరీ స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. స్పెషలైజేషన్‌కు 4 చొప్పున మొత్తం 8 సీట్లు ఉన్నాయి. సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ పీహెచ్‌డీ(ఎన్‌ఎల్‌ఎ్‌సఏటీ-పీహెచ్‌డీ)2023, రిసెర్చ్ ప్రపోజల్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు.
అర్హత: లా స్పెషలైజేషన్‌కు కనీసం 55 శాతం మార్కులతో రెగ్యులర్ ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ ఉత్తీర్ణులు; కనీసం 75 శాతం మార్కులతో మూడేళ్లు/ అయిదేళ్ల లా డిగ్రీ ప్రోగ్రామ్‌లు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇంటర్‌డిసిప్లినరీ స్పెషలైజేషన్‌కు కనీసం 55 శాతం మార్కులతో ఏదేని పీజీ ఉత్తీర్ణులు; ఎల్‌ఎల్‌బీ డిగ్రీతోపాటు కంపెనీ సెక్రటరీషిప్ ఎగ్జామినేషన్/కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎగ్జామినేషన్/సొలిసిటర్స్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులు; ఎన్‌ఎల్‌ఎ్‌స్‌ఐయూ నుంచి ఎంబీఎల్ పూర్తిచేసినవారు అప్లయ్ చేసుకోవచ్చు.
రిసెర్చ్ ప్రపోజల్: అభ్యర్థులు దరఖాస్తు ఫారంతోపాటే రిసెర్చ్ ప్రపోజల్ పంపాలి. ఇందులో కనీసం ఆరు లేదా ఎనిమిది పేజీలు ఉండాలి. టైటిల్, స్టేట్‌మెంట్ - ప్రాబ్లమ్ - ఇన్ఫర్మేషన్ - రిసెర్చ్, రిసెర్చ్ క్వశ్చన్స్ - హైపొథిసిస్ అండ్ మెథడాలజీ, రిసెర్చ్ డిజైన్ తదితర అంశాలు హైలెట్ చేయాలి.
ఎన్‌ఎల్‌ఎస్‌ఏటీ-పీహెచ్‌డీ 2023 వివరాలు: పరీక్ష సమయం రెండున్నర గంటలు. రిసెర్చ్ ఆప్టిట్యూడ్, లాఅంశాలకు సంబంధించి ఒక్కోదానిలో 50 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారిని ఓరల్ ప్రజంటేషన్‌కు పిలుస్తారు. అడ్మిషన్ టెస్ట్ స్కోర్‌నకు 70 శాతం, రిసెర్చ్ ప్రపోజల్‌కు 20 శాతం, ఓరల్ ప్రజంటేషన్‌కు 10 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2,500; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2000; పీహెచ్‌డీ ప్రవేశానికి రూ.3,000
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 6
ఎన్‌ఎల్‌ఎస్‌ఏటీ తేదీలు: ఎంపీపీ అభ్యర్థులకు ఏప్రిల్ 29న; ఎల్‌ఎల్‌బీ ఆనర్స్, పీహెచ్‌డీ అభ్యర్థులకు ఏప్రిల్ 30న
ప్రోగ్రామ్‌లు ప్రారంభం: జూలై 1 నుంచి
వెబ్‌సైట్: www.nls.ac.in